పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

293 చెంగలించీ మహిమల శ్రీ విట్టలేశుఁడు చ. అందపుఁ బైఁడిమేడలో నాదిమూర్తియైన దేవుఁ - డందరికిఁ బ్రత్యక్షమై యున్నాఁడు సందడించి గోపికా జనముల తోడుత చెంది వున్నాఁడిదివో శ్రీ విట్టలేశుఁడు చ. వెలసి వనాల లోన వేద వేద్యుఁడైన హరి అలరి కృష్ణావతారమై యున్నాఁడు యెలమి శ్రీ వేంకటేశుఁ డితఁడే పదారువేల చెలులతోఁ గూడినాఁడు శ్రీ విట్టలేశుఁడు పె.అ.రేకు:0069-06 గుండక్రియసంపుటము: 15–399 పల్లవి: ఎంత మందెమేళము యే మనఁగ వచ్చు నాకు చెంత నీవు నాకుఁ బని చెప్పవలెఁ గాక చ. నే నీకు బంటను నీవు నా కేలికవు ఆనుకొరిని హద్ద నుOడుమని ಯಿಟ್ಟು నియమిOతు నానాఁటికిఁ బేరుకొని నంటున నే రీతిఁ బిలుతు కానీలే నీ వేళ లెఱుఁగక యెట్టు దలఁతు చ. యేదైనా నాసపడి యెట్టు నిన్నడుగవచ్చు సోదించి నీ భావ మెట్టు జూడవచ్చును పాదుగా సంపదలకై పను లెట్టుగొనవచ్చు యేదె(సఁ జిత్త మెఱుఁగ కేగతి విన్నవింతు చ. యెప్పుడైనా నెట్టు వచ్చి యెదుట నిలువవచ్చు చిప్పిల నిన్నంటి యెట్టు సేవ సేతును అప్పఁడ శ్రీవేంకటేశ అలమేలుమంగపతి కప్పిన న్నేలితివి కాదన నెట్టవచ్చు రేకు: 0143-03 ఆహిరి సంపుటము: 02-191 పల్లవి: ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు చింతించితే దాసులకుఁ జేపట్టుఁ గుంచమవు చ. వూరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు సారెకుఁ దర్కవాదాల సాధింపరాదు ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు భారములేనియట్టి భక్తసాధ్యుఁడవు చ. మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియురారు ధిక్కరించి నేర్పులఁ దెలియరాదు వెక్కసాన భూముల వెదకి తెలియరాదు మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు చ. చెలరేఁగి తపములు చేసినా నెఱఁగరాదు యిల నెన్ని చదివినా నెఱఁగరాదు నెలవై శ్రీవేంకటేశ నీదాసానుదాసులఁ గొలిచితేఁ జాలు గక్కునఁ గృపసేతువు రేకు: 0.179-02 బౌళి సంపుటము:02-393 పల్లవి: ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడఁ బిండంతే నిప్పటి యన్నట్లు చ. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు తలఁతురు మిము శైవులు తగిన భక్తులును శివుఁడనుఁచు