పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

289 భ్రమసి యించుకా భయపడ నేను చ. మనుజుల దారుణమహితకర్మముల అనుభవములు గని యులయును వొనర మహోగ్ర యహోరాత్రంబులు చనుచుండంగా జడియను నేను చ. కలుషరౌద్రదుఃఖముల కించుకా కలఁగను చీరికిఁ గైకొనను యెలమిని శ్రీవేంకటేశుఁడ నాపాలఁ గలిగి కాచిత్రివి గాసిల నేను పె.అ.రేకు:0046-02 బౌళి సంపుటము: 15-259 పల్లవి: ఎంత గాల మైనా నిట్టె యీ జీవులకు నెల్లా పొంతనుండి కావవయ్యా పుట్టించిన దేవుడా చ. పండును సస్యము లెల్లా పరగ నేఁటేఁటన పండదు మనసు వొకపరియైనాను నిండును తటాకములు నెలకొన్న వానలను నిండ దొకరి నడిగే నిరతపు నోరు చ. వికసించు విరు లెల్లా వెసఁ దతి వచ్చితేను వికసించ దెంతైనా విజ్ఞానము వొకచోట నిలుచును వొద్దికతోఁగొండ లెల్లా వొకచోటా నుండవు వొంటి విశ్వాములు చ. వస మాను మదించిన వనగజ మైనాను వసము గా దెంతైనా వయోమదము యొసగ శ్రీవేంకటేశ యేలికవు నీవు మాకు యొసగదు నీ కృపచే నిఁకఁ బూర్వకర్మము రేకు:0276-01 రామక్రియ సంపుటము: 03-436 పల్లవి: ఎంత గాలమైనాను హెచ్చీ నాసలు శ్రీ కాంతుఁడ వింతటనై నాఁ గరుణించరాదా చ. పచ్చితనానఁ దిరిగి పండవద్దా చిత్తము గచ్పులఁ దాఁ గసుఁగాయే కలకాలము చచ్చి చచ్చి పుట్టి పుట్టి జారవద్దా కర్మము కొచ్చి కొచ్చి సేసి సేసి గోరపడీఁ గాక చ. రోఁత గడుపున నించి రోయవద్దా దేహము కూఁతలతో రుచులెల్లాఁ గోరీఁగాక చేఁతలు యీగుణమైన సిగ్గుపడవలదా బాఁతిపడి విషయాలఁ బరచయిన్యాఁ గాక చ. నానాఁడే విరతిఁబొంది నవ్వు నవ్వవలదా మానక యీ జీవుఁ డనుమానించీఁ గాక మోనాన శ్రీవేంకటేశ మొక్కి నీదాసుడఁగాఁగా అనిన విన్నియుఁ బరిహరమయిన్యాఁ గాక రేకు:0117-02 సామంతం సంపుటము: 02-098 పల్లవి: ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక యింతయు నేలేటి దైవ మిఁక వేరే కలరా చ. మొదల జగములకు మూలమైనవాఁడు తుదఁ బ్రళయమునాఁడు తోఁచేవాఁడు కదిసి నడుము నిండి కలిగివుండెడివాఁడు