పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

288 అప్పడు తొల్లే అనుమతించె నివి తప్పక యాతనిఁ దలఁచుటే కలది చ. ఆయము నన్నము నందిక లంకె వేయుట దీనికి వెతలేలా కాయములో హరి గలఁడంతరాత్మ యీయెడఁ దను నుతియించుటే కలది చ. వెలిని లోన శ్రీవేంకటేశుఁడే తెలియని మతి నందియమేలా యిలలో మనముల నేలె నాతఁడే సలిగె మనకతని శరణమే కలది రేకు: 0035-01 బౌళి సంపుటము: 01-214 పల్లవి: ఎండగాని నీడగాని యేమైనఁగాని కొండలరాయఁడే మా కుల దైవము చ. తేలుగాని పాముగాని దేవపట్టయినఁగాని గాలిగాని ధూళిగాని కాని యేమైనా కాలకూటవిషమైన గక్కున మింగిన నాటి నీలవరుఁడే మానిజ దైవము చ. చీమగాని దోమ గాని చెలఁది యేమైనఁగాని గాముగాని నాముగాని కాని యేమైనా పాములన్నిమింగే బలుతేజిపైనున్న ధూమకేతువే మాకు దొర దైవము చ. పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైనఁగాని కల్లగాని పొల్లగాని కాని యేమైనా బల్లిదుఁడై వేంకటాద్రిపైనున్నయాతఁడే మమ్మెల్లకాలమును నేలేయింటి దైవము రేకు: 0065-04 ఆహిరి సంపుటము: 01-337 పల్లవి: ఎండలోనినీడ యీమనసు పండు గాయసేయఁబనిలేదు మనసు చ. వానచేతకములవలెనాయ మనసు గోనెఁబట్టినబంకగుణమాయ మనసు మానఁజిక్కినకోలమతమాయ మనసు తేనెలోపలియినాఁగ తెఱఁగాయ మనసు చ. గడిరాజు బదుకాయ కడలేని మనసు నడివీది పెసరాయ నయమైన మనసు గడకుఁగట్టినపాఁతగతి దోఁచె మనసు అడుసులోపలికంబమై తోఁచె మనసు చ. తెరవుచూపినజాడఁ దిరుగు నీమనసు మరుగఁజేసినచోట మరుగు నీ మనసు తిరువేంకటేశుపైఁ దిరమైన మనసు సిరిగలిగినచోటఁ జేరు నీమనసు రేకు: 0141-04 నాట సంపుటము: 02-181 పల్లవి: ఎంత కఠినమో హృదయ మిది చెంత బ్రాత్రcజేసిరి గాఁబోలు చ. అమరC బురాణములOదు నరకముల క్రమములు చదివియుఁ గలంగవు యమకింకరఘవోరాకృతు లటు విని