పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

287 చెక్కలువార గోళ్లఁ జించి చెండాడినయట్టివెక్కసీఁడు వీఁడివో వీర నారసింహుఁడు చ. భవనాసి యేటిదండఁ బాదుకొని కూచుండి జవళి దైత్యుపేగులు జందేలు వేసి భువియదివియు నొక్కపొడవుతో నిండుకొని తివురుచున్నాఁడు వీఁడె దివ్య నారసింహుఁడు చ. కదిసి శ్రీసతి గూడి గద్దెమీఁదఁ గూచుండి యెదుటఁ బ్రహ్లాదుఁడు చేయేత్తి మొక్కఁగా అదన శ్రీవేంకటాద్రి నందరికి వరాలిచ్చి సదరమైనాఁడు వీఁడె శాంత నారసింహుఁడు రేకు: 0342-03 లలిత సంపుటము:04-246 పల్లవి: ఎంచి చూచితే మాకు నిందే నిత్యసుఖము కొంచి యనుమానమైతే కొనదాఁకా లేదు చ. హరి నీగర్భములోన నంగమయి వున్నారము యిరవై వేరేమోక్ష మెంచ నున్నదా నిరతిఁ జూచినవెల్లా నీరూపులే మాకు ధరలోన నింతకంటె ధ్యానమున్నదా చ. అంతరాత్మవైన నిన్నే యాతుమకు నిచ్చితిని యింతకంటె నే నడిగేది యిఁకనున్నదా పొంతనే భూకాంత పుట్టిన నెలవు మాకు యింతకంటె తల్లిదండ్రు లిఁకనున్నారా చ. పొరి నెరుకే జ్ఞానము పొంచి మరపే సమాధి సారిది నేఁడింతకంటే సుఖమున్నదా గరిమ శ్రీవేంకటేశ కల్పితమింతా నీదె శరణంటే యింకా విచారమున్నదా రేకు:0151-01 దేసాక్షి సంపుటము: 02-235 పల్లవి: ఎంచి చూడరో ఘనులార యిందీవరాక్షుఁడు రక్షకుఁడు సంచితముగ నితని శరణంటే సర్వఫలప్రద మిందరికి చ. హరిఁ గొలువని కొలువులు మఱి యడవి(గాసిన వెన్నెలలు గరిమల నచ్చుతు వినని కథలు భువి గజస్నానములు పరమాత్మునికిఁ గాని తపంబులు పాతాళముల నిధానములు మరుగురునికిఁ గాని పూవులపూజలు మగఁడులేని సింగారములు చ. వైకుంఠుని నుతియించని వినుతులు వననిధిఁ గురిసిన వానలు ఆ కమలోదరుఁ గోరనికోరికె లందని మానిఫలంబులు శ్రీకాంతునిపైఁ జేయని భక్తులు చెంబుమీఁది కనకపుఁబూఁత దాకొని విష్ణుని తెలియని తెలువులు తగ నేటినడిమి పైరులు చ. వావిరిఁ గేశవునొల్లని బదుకులు వరతఁ గలపు చింతపండు గోవిందుని కటు మొక్కని మొక్కులు గోడలేని పెనుచిత్రములు భావించి మాధవుపై లేనితలఁపులు పలు మేఘముల వికారములు శ్రీవేంకటపతికరుణ గలిగితే జీవుల కివియే వినోదములు రేకు:0309-02 దేశాక్షి సంపుటము:04-050 పల్లవి: ఎంచి సేయుపను లిఁక లేవు కొంచక యూతనిఁ గొలుచుటే కలది చ. తప్పదు కర్మము తానెందున్నా చెప్పఁగ దీనికిఁ జింతేలా