పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

286 పొసఁగ వారికిఁగాను పూనుకవచ్చి నీవు వసుధ జనించితేను వడి నిన్నుఁ గందుము చ. అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు వెడఁగు మునులు విన్నవింతురు నీకు తడవి ధర్మము నిల్ప ధరణిఁ బుట్టుదు నీవు బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే చ. నీకంటే మాకుఁ జూడ నీదాసులే మేలు పైకొని వారున్నచోటఁ బాయకుందువు చేకొని శ్రీవేంకటేశ చెప్పఁగానే వారిచేత నీకథలు విని విని నే మీడేరితిమి రేకు:0015-01 ఆహిరి సంపుటము: 01-089 పల్లవి: ఊరికిఁ బోయెడి వోతఁడ కడు చేరువ తెరు వేఁగి చెలఁగుమీ చ. ఎడమతెరువువంక కేఁగిన దొంగలు తొడిఁబడ గోకలు దోఁచేరు కుడితెరువున కేఁగి కొట్టువడక మంచినడిమితెరువుననే నడవుమీ చ. అడ్డపుఁ దెరువుల నటునిటుఁ జుట్టాలు వెడువెట్టుచు నిన్ను వేఁచేరు గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక దొడ్డతెరువువంక తొలఁగుమీ చ. కొండతెరువు కేఁగి కొంచపుసుఖముల బండై తిరుగుచు బడలేవు అండనుండెడిపరమాత్ముని తిరుమలకొండతెరువు తేఁకువ నేఁగుమీ పె.అ.రేకు: 0031–06 సామంతం సంపుటము: 15-176 పల్లవి: ఎంచఁ బోతే మావల్ల నీ కే మున్నది నించిన యీ పుణ్యమెల్ల నీ దింతే కాక చ. పోయిన జన్మ మొఱఁగ పుట్టిన ೩)ಟ್ಟು ಗೇಖ(ಗೆ కాయము గరఁగేది యొక్కడో యెఱుఁగ యీయెడ నేమి దలఁచే నెట్టి ధ్యానము సేసేను నీయంత రక్షించే మేలు నీదింతే కాక చ. రేపటిసుద్దు లెఱుఁగ రేతిరిసుద్దు లెఱుఁగ పై పై సంసారముల భ్రమయెఱుఁగ చేపట్టి యెట్టు పూజించే సేవ నీ కేమి సేసేను నీ పెఁపున గాచేమేలు నీ దింతే కాక చ. నే నెడెవ్వఁడనో యెఱుఁగ నిలుక డేదో యెఱుఁగ ఆనుకొన్న యీ జగము అంతా నెఱుఁగ కోనల శ్రీ వేంకటేశ కొలువ నే మెఱుఁగుదు నే నని కై కొన్నమేలు నీ దింతే కాక రేకు: 0328-03 గౌళ సంపుటము: 04–162 పల్లవి: ఎంచి చూచితే నితని కెవ్వ రెదురు కొంచం డేమిటికి వీఁడె ఘనోర నారసింహుఁడు చ. గక్కన నహోబలాన కంబములోన వెడలి వుక్కుమీరి హిరణ్యుని నొడిసిపట్టి