పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

285 నరహరినామ మెంచి నాకుఁ గూడపెట్టేనంటే అరుదైన పుణ్యములు అన్నిలేవు భూమిని చ. రామనామము నొడిగి రవ్వల బోఁజోఁపే నంటే తామసపునరకాలు దగ్గరవందు వామననామమెంచి వరస్వర్గ మెక్కేనంటే యేమిటా నాకడ వారికెడచా దదియు చ. గోవిందనామముచేతఁ గుదించే భవములంటే పావనమాయను నీ భక్తివల్లను శ్రీవేంకటేశ నేను చేకొని నీశరణంటి యేవిధులు నెరఁగను యిదివో నీచిత్తము పె.అ.రేకు:0012-05 బౌళి సంపుటము: 15-066 పల్లవి: ఊరకే పాట్లఁ బడి వొడలే నిత్య మనుచు ఆరిడి వృధా తిరిగీ నయ్యో ప్రాణి చ. నరుఁడు నూరేండ్లవాఁడై నాఁడు చొచ్చె లోకము నరకమో స్వర్గమో నవిఁ గానఁడు పారెలిఁదనుఁ బొదిగిన పుత్రమిత్రకళత్రాదులు అరసి యెన్నటివారో అదియూ నెంచఁడు చ. పనితో యిడుమ పాటువడి గడించిన సామ్మ త్రనకో వొరులకో త్రా నెఱుఁగఁడు అనుభవించవలసె అన్నిట కర్మఫలాలు వెనకో ముందరో యిది విచారించఁడు చ. నుదుట వ్రాసిన వ్రాలు నోరిఁ జేతఁ జుట్టుకొని తుదకో మొదలికో తొంగి చూడఁడు యిదివో శ్రీ వేంకటేశుఁ డెదుటనే వున్నాఁడు కదిసి శరణంటేఁ గాచీనతఁడు రేకు: 0334-01 సామంతం సంపుటము: 04-196 పల్లవి: ఊరకే వెదకనేల వున్నవి చదువనేల చేరువనె వున్నదిదే చెప్పరాని ఫలము చ. కోపము విడిచితేనె పాపము దానే పోవు దీపింప సుజ్ఞానముతెరు విదివో లోపల మనిలుఁడై లోకముమెచ్చుకొరకు పైపైఁగడిగితేను పావనుఁడౌనా చ. ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు కందువ నాస మానితే కైవల్యము బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంఠము చ. కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు అంతట మాటలె యాడి హరి శరణనకుంటే దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి రేకు:0138-02 సామంతం సంపుటము: 02-161 పల్లవి: ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని పూరిజీవులము, నీవు పురుషోత్తముఁడవు చ. అసురలు భువిఁ బుట్టుటది వుపకారమే అసురలు బాధిOతు రమరులను