పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

284 చలనమించుక లేక సంసారవారధి దాఁటి నిలిచినప్పుడుగా నిజమోక్షము చ. పంచేంద్రియాల మీరి భక్తి హరిమీఁద బెట్టి మంచివాఁడైనప్పుడుగా మరి మోక్షము అంచల యాసలు మాని ఆచార్యుసేవ చేసి మించినప్పుడుగా ఆమీఁది మోక్షము చ. శాంతమే కూడుగానుండి సమచిత్తమునఁ బొంది మంతుకెక్కినప్పుడుగా మరి మోక్షము అంతట శ్రీవేంకటేశుఁ డాదరించి మన్నించితే నంతరంగమున నున్నదనాది మోక్షము రేకు:0118-02 గౌళ సంపుటము: 02-104 పల్లవి: ఊరకే దొరుకునా వున్నతోన్నతసుఖము సారంబు దెలిసికా జయము చేకొనుట చ. తలఁపులోపలి చింత దాఁటినప్పుడు గదా అలరి దైవంబు ప్రత్యక్షమాట కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా తలకొన్న మోక్షంబు తనకుఁ జేపడుట చ. కర్మంబు కసటు వోఁ గడగినప్పుడు గదా నిర్మలజ్ఞానంబు నెరవేరుట మర్మంబు శ్రీహరి నీమఱఁగు జొచ్చినఁ గదా కూర్మిఁ దన జన్మమెక్కుడు కెక్కుడౌట చ. తన శాంతమాత్మలోఁ దగిలినప్పుడు గదా పనిగొన్న తన చదువు ఫలియించుట యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు తనకు నబ్బినఁ గదా దరిచేరి మనుట రేకు:0203-04 ధన్నాసి సంపుటము: 03-016 పల్లవి: ఊరకే నీ శరణని వుండుటే నా పనిఁ గాక యీ రీతి నా వుపాయము లేడ కెక్కీనయ్యా చ. ముందే అంతర్యామివై మొగి నాలో నుండఁగాను చెంది నిన్ను లేనివానిఁ జేసుక నామనసులో గొంది నీయూకారముగా కొంత నే భావించుకొంటా ఇందుఁ గల్పితధ్యానము లెట్టు చేసేనయ్యా చ. కన్నులఁ జూచినందెల్ల కమ్మి నీవై యుండఁగాను అన్నిటాఁ బ్రత్యక్షమందు అభావన చేసుకొని విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు పన్నిన ప్రయాసాలఁ బడనేటికయ్యా చ. శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతివై కొలువుండి ఆవటించి తలఁపులో నచ్చొత్తి నట్టుండఁగాను దేవుం డెట్టివాఁడంటా తెగని చదువులందు సాశివలుగా నింకనేమి సాదించేనయ్యా రేకు: 0339-05 దేశాక్షి సంపుటము: 04-230 పల్లవి: ఊరకే నోరుమూసుక వొంటి నీకు మొక్కేమయ్య చేరి నారాయణ నీవు చేసినట్టు సేయవే చ. హరినామముఁ దలఁచి అణఁచేనంటేనయ్య సలి నా పాత్రకములు చాల వOదుకు