పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

281 చ. యొక్కడ వొయ్యెడి జీవుఁ డేది వైకుంఠము యిక్కడ హరి యున్నాఁడు హృదయమందె ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల కక్కసానఁ జిక్కి తమ్ముఁ గానఁడింతేకాక చ. యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ కామించి యూతఁ డిన్నిటాఁ గలిగుండఁగా దోమటి సంసారపు దొంతికర్మములఁ జిక్కి కాముకుఁడై కిందుమీఁదు గానఁడింతేకాక చ. యే విధులు తాఁ జేసీ యెవ్వరి నాడఁగఁబోయినా శ్రీవేంకటేశ్వరు సేవచేత నుండఁగా భావ మాతఁడుగాను బ్రతికె నిదివో నేఁడు కావరాన నిన్నాళ్లు కానఁడింతేకాక పె.అ.రేకు: 0039-02 సామంతం సంపుటము: 15-220 పల్లవి: ఉన్నతోన్నతుఁడు వుడయవరు యెన్నననంతుఁడే యీ యుడయవరు చ. సర్వలోకముల శాస్త్రరహస్యము లుర్విఁ బొడమె నీ యుడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించె నన్నిటా నుడయవరు చ. వెక్కసఁపు శ్రీవిష్ణుభక్తియే వొక్కరూపమే వుడయవరు చక్కనైన సుజ్ఞానమున కిరవై వుక్కు మీటె నిదె వుడయవరు చ. కదిసె మోక్షసాకారము దానై వుదుటున నిలిచె నీ యుడయవరు యిదిగో శ్రీవేంకటేశ్వరు యివాడై పొదలుచు నున్నాఁడు భువి నుడయవరు రేకు: 0313-03 బౌళి సంపుటము:04-075 పల్లవి: ఉన్నదిందునే వొక్క విచారము కన్నది గానుపు ఘనపుణ్యులకు చ. అగపడి పవిత్ర మపవిత్రంబును జగమొక్కటనే జరగెడిని పగటున నిది నా భావవికారమొు జగదీశ్వరుని రచన నేరుపులో చ. అలలిన జ్ఞానము నజ్ఞానంబును తలఁ పొక్కటనే తగిలెడిని చలమున నిది నా సహజపు గుణమో పెలుచగు శ్రీహరి పెరిరేఁపనలే చ. దాహపు నాలో ధర్మమధర్మము దేహ మొక్కటనె తిరిగెడిని శ్రీహరి నాయాత్మ చేరిన ఫలమో యివాహల శ్రీవేంకటేశ్వరు కరుణో పె.అ.రేకు:0005-02 లలిత సంపుటము: 15-027 పల్లవి: ఉన్నమాట లిక నేల వో దేవా యొన్నటి కిదేమాట యింకా నింకాను