పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

280 చ. పుట్టని జన్మము లేదు పొందని భోగము లేదు నెట్టన మాయలఁ జిక్కి నేఁ దొల్లి కొట్టఁగొన కెక్కలేదు కోరి మొదలను లేదు నట్టనడుమ నున్నది నాబ్రదుకు చ. చొరని లోకము లేదు చూడని విద్యలు లేదు నిరతి మాయలఁ జిక్కి నేఁ దొల్లి దరి చేరుటా లేదు తగులు లేదు నానాఁడు నరకమే కురిసీని నాబ్రదుకు చ. చేయని కర్మము లేదు చెందని ఫలము లేదు నీయిచ్చ మాయలఁ జిక్కి నేఁ దొల్లి యీయెడ శ్రీవేంకటేశ యిట్టె నీవు నన్నేలఁగా నాయిచ్చ సఫలమాయ నాబ్రదుకు రేకు:0136–06 సాళంగం సంపుటము: 02-153 పల్లవి: ఉన్న మంత్రా లిందు సరా వొగి విచారించుకొంటే విన్నకన్నవారికెల్ల విషునామమంత్రము చ. పరగఁ బుచ్చకాయలఁ బరసిపోదు మంత్రము గరిమ మట్టంటులేని ఘనమంత్రము వరుస నెవ్వరు విన్నా వాఁడిచెడని మంత్రము అరయ నిదొక్కటేపో హరినామమంత్రము చ. యేజాతినోరికైన నెంగిలిలేని మంత్రము వోజదప్పితేఁ జెడకవుండే మంత్రము తేజాన నొకరికిస్తేఁ దీరిపోని మంత్రము సాజమైన దిదేపో సత్యమైన మంత్రము చ. యిహముఁ బరముఁ దానే యియ్యఁజాలిన మంత్రము సహజమై వేదాలసార మంత్రము బహునారదాదులెల్ల పాటపాడిన మంత్రము విహితమయిన శ్రీవేంకటేశు మంత్రము రేకు: 0340-05 హిందోళం సంపుటము: 04-236 పల్లవి: ఉన్న సుద్దులేల మాకు వూర విచారములెల్ల వెన్నునికి మొక్కుటే వేవేలు మాకు చ. నగధర నందగోప నరసింహ వామన జగదేకపతియనే జపము మాది తగు హరిడింగరీఁడ దాసుఁడ బంటననేటిమిగులఁ బెద్దతనము మించేది మాకు చ. హరి పుండరీకాక్ష ఆదినారాయణయనేటిధర నామమంత్రములే ధనము మాకు సరుస శంఖచక్రాలు సర్వేశుదాసుల సేవె మరిగినదె మూమతమును మనికె చ. శ్రీవేంకటేశయని శేషగిరివేదాద్రి భావించి కొలుచుటే మాబ్రదుకెల్లను కైవల్యమిదియె కంటి మిట్టి మంచిత్రోవ పావనమైతిమి మమ్ముఁ బాలించె నితఁడు రేకు: 0213-06 శంకరాభారణం సంపుటము: 03-078 పల్లవి: ఉన్నచోనే మూఁడులోకా లూహించి చూచితే నీవే కన్నచోటనే వెదకి కానఁడింతేకాక