పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

279 చ. కతలలో నినుఁ జెప్పఁగా వినుటే కాని క్షితి నెట్టివాఁడ వెతా చేరి తెలియఁగ లేదు గతి నీవు గలవనఁగా వెదకుదుఁ గాని తతితోడ నీ మూర్తి దరిసించ లేదు చ. గంగ నీ తీర్థ మనఁగా మునిఁగి తేలు గాని ముంగురులు నీ పాదము మోవఁగా మోపుట లేదు అంగపు వేదము నీ మాటనఁగాఁ జదివెఁగాని కంగున నీవు మాటాడఁగా వినుట లేదు చ. అల వైకుంఠము గల దనఁగాఁ గోరుట గాని యిల నీ వేంకటాద్రిపై వలె మెలఁగుట లేదు అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర కలిగె నీ కృప నాకుఁ గడము లేదు రేకు:0112-03 మలహరి సంపుటము: 02-069 పల్లవి: ఈహీ శ్రీహరిఁ గంటే యింత లేదుగా వట్టి దాహపుటాసల వెట్టి దవ్వ టింతేకాకా చ. పలుమారు నిందరిని భంగపడి వేఁడేది యిలపై దేహము వెంచేయిందు కింతేకా కలికికాంతలచూపు ఫూతలకు భ్రమసేది చెలఁగి మైమఱచేటి చేఁత కింతేకా చ. పక్కన జన్మాలనెల్లాఁ బాటువడేదెల్లాను యొక్కడోసంసారాన కిందు కింతేకా వొక్కరిఁ గొలిచి తిట్టు కొడిగట్టేదెల్లాను చక్కుముక్కు నాలికెపై చవి కింతేకా చ. గారవాన ధనములు గడియించేదెల్లాను ఆరయ నాదని వీఁగేయందు కింతేకా చేరి శ్రీవేంకటపతి సేవకుఁ జొరనిదెలా భారపుఁ గర్మపుబాధఁ బట్టువడికా రేకు: 0333-04 రామక్రియ సంపుటము: 04-193 పల్లవి: ఉండినట్టే వుండును వుండకున్న మానును అండనే శ్రీహరిమాయ నమరినలోకము చ. యేదైనా మంచిదే యెట్టయినా మంచిదే సేద దేరినట్టి పూర్ణచిత్తునకును కాదు గూడదనరాదు కలస్వభావమునకు ఆదినుండి హరిమాయ నత్తినడి లోకము చ. యెండైనా మంచిదే యెంతనీడైనా మంచిదే పండినజనభక్తుల ప్రసన్నులకు నిండె నిండదనరాదు నిచ్చనిచ్చఁబ్రకృతికి కొండవంటిహరిమాయ గురియైనలోకము చ. పాపమైన మంచిదే బలుపుణ్యమైన మంచిదే శ్రీపతిని శరణన్నజీవునికిని వోప నోపేన రాదు వొద్దిక శ్రీవేంకటేశు చేపట్టినమాయలోనఁ జిక్కినది లోకము రేకు:0220-03 శంకరాభరణం సంపుటము: 03-110 పల్లవి: ఉడివోని సంసారాన నున్నారము నట్ట నడుమాయు నవ్వులకు నాబ్రతుకు