పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

278 చ. సకలకర్మము చేత సాధ్యముగాని నీవు వొక ఇంచుకంత భక్తి కొగి లోనైతి ప్రకటించి బహువేదపఠనఁ జిక్కని నీవు మొకరివై తిరుమంత్రమునకుఁ జిక్కితివి చ. కోటిదానములచేత కోరి లోనుగాని నీవు పాటించి శరణంటేనే పట్టి లోనైతి మేటి వుగ్రతపముల మెచ్చి కైకొనని నీవు గాటపుదాసులై తేనే కైకొని మన్నించితి చ. పెక్కుతీర్ధములాడిన బేధించరాని నీవు చొక్కి నీముద్రవారికి సులభుఁడవు గక్కన దేవతలకుఁ గానరాని నీవు మాకు నిక్కడ శ్రీవేంకటాద్రి నిరవైతివి రేకు:0247-04 కన్నడగౌళ సంపుటము: 03-269 పల్లవి: ఈయపరాధములు సహించవయ్యా పాయక మమ్ము రక్షించేపని నీదే కాదా చ. ఆకడ నీకడ మాలో నంతర్యామివి నీవు నీకుఁ జేసే విన్నపాలు నీవెరఁగవా పైకొని వోరువలేక పదరితి మింతేకాక రాకపోక నీవు మమ్ము రక్షించకుండేవా చ. అట్టు కెక్కి దాసుల మఱవక రక్షించే నీవు గుట్టుతో మమ్ము వహించుకొనకుండేవా పట్టలేక వేగిరించి పైపై దూరితిమిఁ గాక ఇట్టే మాకీ సిరులు నీవిచ్చినవే యెపుడు చ. యిదె శ్రీవేంకటేశ మమ్మేలినవాఁడవు నీవు వదలకుండ నీవు నావాఁడవే కావా అదన మన్నించంగానే ఆసఁజే చాఁచితిఁగాక చెదరక నాఁడే నాకుఁ జేతిలోనివాఁడవు చి.ఆ.రేకు:0006-03 సాళంగనాట సంపుటము: 10-033 పల్లవి: ఈలగద్ద మూకలోనయించుకకోడిపిల్లకు మూలమూలలఁ దలారికములు చెల్లునా చ. మంచుకుఁ బెట్టినయట్టి మైనపుఁగుళ్లాయలు అంచెల లవుడి పెట్టు లానఁ బోయీనా పంచేంద్రియము లెల్ల బలవంతములై వుండఁగా యించుక నావైరాగ్య మేడ కెక్కీని చ. గుగ్గిళ్లు వెలవెట్టి కొనిన గుఱము లెల్ల దగ్గరి యగడుతలు దాఁటఁబోయీనా నిగుల బాదకుఁ గాక నేరిచిన సుద్దులెల్లా వెగ్గళమై యింతటను వెలవెట్టీనా చ. పాశీరుకుఁ జాలక పాయి పాడిచే పాటు లెల్లా నారటిలుఁ గాక అవి నాటఁ బోయినా గారవాన శ్రీవెంకటనాధుఁడు గావఁగా భారములు భయములుఁ బాసె నిOతె కాకా పె.అ.రేకు:0069-05 మాళవిగౌళ సంపుటము: 15-398 పల్లవి: ఈశ్వరా నా భావ మిది యెట్టున్నదో నీ తలఁపు శాశ్వతుఁడ నీ చిత్త మేసంగతో నా భాగ్యము