పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

277 చ. విరతి మాధనము విజ్ఞానమే ధనము మరిగిన తత్వమే మా ధనము పరము మా ధనము భక్లే మా ధనము మాకరిరాజవరదుఁడే కైవల్యధనము చ. శాంతమే మా ధనము సంకీర్తనే ధనము యెంతైనా నిశ్చింతమే ఇహధనము అంతరాత్మే మా ధనము హరిదాస్యమే ధనము యింతటా లక్షికాంతుఁడింటిమూలధనము చ. ఆనందమే ధనము ఆచార్యుఁడే ధనము నానాటఁ బరిపూర్ణమే ధనము ధ్యానమే మా ధనము దయే మా ధనము పానిన శ్రీవేంకటాద్రిపతియే మా ధనము పె.అ.రేకు:0050-03 కాంభోది సంపుటము: 15-283 పల్లవి: ఈపాట సుఖమూ యిలలోని జీవునికి చేపట్టి యింత నేసిన శ్రీపతి నెఱుఁగఁడు చ. నిరతిఁ గట్టివేసినవాని విడిచి మోపెత్తితే పరువువారి సంతోషపడినయట్లు దరిద్రుఁడయినవాని తగు రాజుఁగాఁ జేసితే మురిసి వేడుకె కాని ముందర యెఱుఁగడు చ. గుండు మోచేయట్టివాని గొప్ప యేంత మెత్తించితే అందనే పాడుచు నలపార్చుకొన్నట్లు పండని తపసిఁ దెచ్చి బలుసంసారిఁ జేసితే దండితనమే కాని యందలి పాబ్లెంచఁడు చ. పట్టి దున్నేయొద్దుఁ దెచ్చి బంతి గట్టి నురిపితే నట్టే గవుక మేసి మల్లాడినయట్లు గట్టిగా శ్రీవేంకటేశ కష్టునిఁ బుణ్యుఁ జేసితే వట్టియహంకారియై యెవ్వరినిఁ గైకొనఁడు రేకు: 0030-04 శ్రీరాగం సంపుటము: 01-185 పల్లవి: ఈభవనమునకుఁ జూడ నేది గడపల తనదు ప్రాభవం బెడలించి బాధఁ బెట్టించె చ. చెప్పించెఁ బ్రియము వలసినవారలకునెల్ల రప్పించె నెన్నఁడును రానిచోట్లకును వొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను తప్పించె కోరికల తిరిగి నలుగడల చ. పుట్టించె హేయంపు భోగయోనులనెల్ల కట్టించె సంసారకలితబOధముల పెట్టించె ఆసలను పెడకొడములఁ దన్ను తిట్టించె నిజద్రవ్యదీనకుల చేత చ. బెదరించె దేహంబు పెనువేదనలచేత చెదరించె శాంతంబు చెలఁగి చలమునను విదళించె భవనములను వేంకటేశ్వరుఁ గొలిచి పదిలించె నతనికృప పరమసౌఖ్యములు రేకు:0210-02 సాళంగనాట సంపుటము: 03-056 పల్లవి: ఈమాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను నేమమెంత నేమెంత నీ కరుణ యెంత