పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

276 చ. తల్లియై పోషించు తండ్రియె రక్షించు వుల్లపు బంధువుఁడై వొడ లరయు మెల్లనె దాతై ఇచ్చు మొలుఁతయై యాదరించు యెల్లవిధబంధువుఁడు యీతఁడే పో విషుఁడు చ. యేలికయై మన్నించు నిష్ణుఁడై బుద్ధి చెప్పు చాలుమానిసియై యంచలఁ దిరుగు బాలుఁడై ముదుచూపు ప్రాణమై లోన నుండు యీలాగుల బంధుఁ డీతఁడే పో విషుఁడు చ. దేవుఁడై పూజగొను బ్రిష్టిగోచరమై శ్రీవేంకటాద్రిమీఁద సిరు లొసగు తావై యెడమిచ్చు తలఁపై ఫలమిచ్చు యీవల నావల బంధుఁడీతఁడేపో విష్ణుఁడు రేకు: 0391-02 లలిత సంపుటము: 04-527 పల్లవి: ఈతని మహిమలు యెంతని చెప్పెద చేతులమొక్కెదఁ జెలఁగుచు నేను చ. శ్రీ నరసింహుడు చిన్మయమూరితి నానావిధకరనురుఁడు దారుణ దైత్య విదారుఁడు విష్ణుఁడు తానకమగు మా దైవంబితఁడు చ. అహోబలేశుఁడు ఆదిమ పురుషుఁడు బహు దేవతా సార్వభౌముఁడు సహజానందుఁడు సర్వ రక్షకుఁడు యిహ పరము లోసఁగు యేలిక యితఁడు చ. కేవలుఁడగు సుగ్రీవ నృసింహుఁడు భావించ సుజన పాలకుఁడు శ్రీ వేంకటేశుఁడు చిత్తజ జనకుఁడు వేవేలకు నిలువేలుపు యితఁడు రేకు:0110-03 గౌళ సంపుటము:02-057 పల్లవి: ఈతనిఁ గొలిచితేనే యిన్ని గొలలునుఁ దీరు చేతనఁ బెట్టు పుణ్యాలు చేరువనే కలుగు చ. పట్టి కాళింగునిఁదోలి పాముకొలదీర్చినాఁడు బట్టబాయిటనే రేపల్లెవారికి అట్టె పూతనఁ జంపి ఆఁడుఁగొలదీర్చినాఁడు గట్టిగాఁ గృష్ణుఁడు లోకమువారికెల్లను చ. బలురావణుఁ జంపి బాఁపనకొలదీర్చినాఁడు యిలమీఁదఁ గలిగిన ఋషులకెల్లా కొలఁది మీరినయట్టి కోఁతికొలదీర్చినాడు సాలసి రాఘవుండదె సుగ్రీవునికిని చ. వొలిసి పురాలు చొచ్చి వూరఁగొలదీర్చినాఁడు అల తనదాసులైన అమరులకు సిలుగుఁగొలలు దీర్చి సేన వరా లిచ్చినాఁడు చెలఁగి పరుషలకు శ్రీవేంకటేశుఁడు రేకు: 0190-02 బౌళి సంపుటము: 02-457 పల్లవి: ఈతని మూలమెపో యిలఁగల ధనములు యీతఁడు మాకు గలఁడు యెంత లేదు ధనము