పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

275 చ. దిక్కులు సాధించుటకు దేవదేవోత్తముఁ డదే యొక్కెను తేరుమీఁద యెచ్చరికతో చక్కాడి దనుజులను సమరములు గెలిచి యిక్కువతో వీధి వీధి నేఁగీ నిదిగో చ. సకలాయుధములునుఁ జక్రము చేతులఁ బట్టి వెకలియె శంఖము వేవేగ నాడించె వికలులై రాక్షిసులు వీఁగి లోఁగి హతులైరి అకలంకుఁ డీ హరి అన్నిటాను మించెను చ. విజయధ్వజము నదె వీఁడె శ్రీవేంకటేశుఁడు భజన నలమేలుమంగ పలుమారు మెచ్చెనదె త్రిజగములు నితఁడె దిక్కె కాచీ నిదె గజబిజ లింక నుడుగరో రాక్షసులు రేకు: 0385-02 సాళంగనాట సంపుటము: 04-493 పల్లవి: ఈతని దెంతప్రతాప మీతని దెంతవుదుట యీతఁడు రామునిబంటు యీతని సేవించరో చ. వుదయాస్త నగముల కొకజంగ చాఁచినాఁడు చదివె రవితో సర్వ శాస్త్రములు తుద బ్రహ్మాండము మోవఁ దోఁక మీఁది కెత్తినాఁడు పెద పెద కోరల పెను హనుమంతుఁడు చ. కుడిచేత దనుజులఁ గొట్ట నూఁకించినాఁడు యెడమచేఁ బండ్లగొల పిడికిలించె వుడు మండలము మోవ నున్నతి( బెరిగినాఁడు బెడితపు మేనితోడఁ బెనుహనుమంతుఁడు చ. పుట్టుఁగవచ కుండలంబులతోడ నున్నవాఁడు గట్టి బ్రహ్మపట్టానకుఁ గాచుకున్నాఁడు ఇట్టే శ్రీ వేంకటేశు నెదుటఁ బనులు సేసీ బెట్టిదపు సంతోసానఁ బెనుహనుమంతుఁడు &O రేకు:0293-01 లలిత సంపుటము: 03-536 పల్లవి: ఈతని నెఱఁగకుంటే నిల స్వామిద్రోహము ఫూతల నేఱు గుడిచి కాలువ పొగడుట చ. హరిపాదముననే యడఁగె లోకములెల్ల హరినాభినే పొడమి రదివో బ్రహ్మాదులు హరినామము వేదాల కాదియు నంత్యమునాయ హరిదాసులే వశిష్టాదు లిందరును చ. విష్ణుఁడే యమృత మిచ్చె విష్ణుఁడే ధరణి మోఁచె విషువాజ్ఞ నడచేది విశ్వ మింతాను విష్ణుచక్రమున దైత్యవీరులెల్లా నడఁగిరి విష్ణువు ముఖమునందే విప్టులు జనించిరి చ. పరమపు శ్రీపతివే భారతరామాయణాలు పరమాత్ముఁ డితఁడే పలుజీవుల యందెల్లా పరము చేచేతఁ జూపె పట్టి శ్రీవేంకటేశుఁడు పరమానంద మొసఁగు భక్తులకు నితఁడు రేకు: 0183-03 లలిత సంపుటము: 02-417 పల్లవి: ఈతని మరచివుంటి మిన్నాళ్లును యీతల నేఁడెచ్చరించె నీతఁడే పో విష్ణుఁడు