పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

274 శాశ్వతబ్రహ్మాండాలు శరీరమైన బ్రహ్మము యీశ్వరుఁడై మహరాట్టె యిందరిలో బ్రహ్మము చ. సూర్యునిలో తేజము సామునిలో తేజము శౌర్యపు టనలుని భాస్వత్తేజము కార్యపు టవతారాలఁ గనుఁగొనే తేజము వీర్యపుటెజ్ఞభాగాల విషునామ తేజము చ. పరమపురుషమూర్తి ప్రకృతియైన మూర్తి గరిమతో మహదహంకార మూరిత్రి ధరఁ బంచతన్మాత్రలు తత్త్వములైన మూరితి గరుడానంత సేనేశకర్తయైన మూరితి చ. భాగవతపు దైవము భారతములో దైవము సాగిన పురాణవేదశాస్త్ర దైవము పోగులైన బ్రహ్మలను బొడ్డునఁ గన్న దైవము శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము రేకు: 9075-01 -- సంపుటము: 04-578 పల్లవి: ఈతఁడే హరుఁడు యీతఁడే యజుఁడు ఈతనికి నీచేఁతలెంత ఘనమటుగాన చ. కడుఁ బెక్కు బ్రహ్మాండకటకములు సుడివడిన కడుపలో నిడుకొన్న ఘనుఁడు వెడలి పూతకిచంటివిషము దాఁగినయంత వడిఁ దనకు నేమాయ వట్టిబూమెలు గాక చ. ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బనపు డుల్లసిల్లుచు నీతఁడుండు మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి బల్లిదుఁడవని నిన్నుఁ బరిణమింతురుగాన చ. తిరువేంకటేశ్వరుఁడు దేవదేవోత్తముఁడు పరిపూరుఁ డచ్యుతుఁ డభవుఁడు శరణాగతుల రక్షసేయు వాడను మాఁటి గురుత్రుగాఁ దలపాశీసి కొరెనియూడఁగా వలసె పె.అ.రేకు:0027-04 సాళంగనాట సంపుటము: 15-156 పల్లవి: ఈతని కెదురు లేరు యొక్కడ చూచిన నిదె చేతనే ప్రతాపముతో చెలరేఁగీ నితఁడు