పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

273 బలుభూమిదూరి వొక్కకొలికికిఁ దెచ్చినాఁడు నిలిచి యంతరిక్షమునిండి భేదించినాఁడు చ. చేరి బ్రహ్మాండము తూఁటుసేసి చూచినాఁడు వీరుఁడై రాచమూఁకల వెదకినాఁడు ఘనోరపుత్రికూటాదికొండలు జయించినాఁడు వారించి చక్రవాళపర్వతము దాఁటినాడు చ. మట్టి దైత్యపురాల మర్మాలు విదళించినాఁడు చుట్టువేడెమున యింతా సోదించినాఁడు యిట్టె శ్రీవేంకటాద్రినిరవై యొక్కినవాఁడు రట్టుగాఁ దనదాసులనిట్టె రక్షించినాఁడు రేకు:0319-06 సామంతం సంపుటము: 04-111 పల్లవి: ఈతఁడే ద్రిష్టవరము లియ్యఁగాఁ గాక ఆతలీతలీ సుద్దులవి నమ్మఁగలమా చ. హరి రూపెరుఁగుదుమా అరసి ఇంతకతొల్లి సారది శ్రీవేంకటేశుఁ జూచి కాక గురుమంత్రము నేర్తుమా గోవిందుఁడితని నామ మురుటై లోకాలనెల్ల నుండఁగా గాక చ. వైకుంఠ మెరుఁగుదుమా వర్ణించి ఇంతకతొల్లి దీకొని శ్రీవేంకటాద్రిఁ దిరిగి కాక యేకడ దేవతల నేమెందునైనాఁ గంటిమా చేకొని హరిదాసులఁ జేరి మొక్కే కాక చ. పుట్టు నేఁ గంటినా పొంచి శ్రీవేంకటపతి వొట్టి నాయంతరాత్మై యుండఁగాఁ గాక కొట్టఁగొనపర మేడ కొంచెపు దేహి నేనేడ అట్టె యాతనికి శరణని కొలిచి కాక రేకు:0232-04 దేసాళం సంపుటము: 03-183 పల్లవి: ఈతఁడే ముక్తిదోవ యీతఁడే మాయాచార్యుఁ డీతఁడు గలుగఁబట్టి ఇందరు బదికిరి చ. అదివో తాళ్లపాక అన్నమాచార్యులు యిదె వీఁడె శ్రీవేంకటేశు నెదుట వెదవెట్టి లోకములో వేదములన్నియు మంచిపదములు సేసి పాడి పావనము సేసెను చ. అలరుచుఁ దాళ్లపాక అన్నమాచార్యులు నిలిచి శ్రీవేంకటనిధియే తానై కలిదోషములు వాప ఘనపురాణములెల్ల పలుకుల నించినించి పాడినాఁడు హరిని చ. అంగవించెఁ దాళ్లపాక అన్నమాచార్యులు బంగారు శ్రీవేంకటేశు పాదములందు రంగుమీర శ్రీవేంకట రమణుని యలమేలుమంగను యిద్దరిఁ బాడి మమ్మ గరుణించెను రేకు: 0175-03 సాళంగనాట సంపుటము:02-371 పల్లవి: ఈతఁడే యీతఁడే సుండి యెంత యెంచిచూచినా చేతనే వరాలిచ్చీ శేషాచలేశుఁడు చ. విశ్వరూపబ్రహ్మము విరాట్టయిన బ్రహ్మము ఐశ్వర్యస్వరా టాసామ్రాట్టయిన బ్రహ్మము