పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

272 తాపసోత్తముల చింతాసౌధములలోన దీపించు సుజ్ఞానదీప మితఁడు చ. జలధికన్యాపాంగ లలితేక్షణములలో కలసి వెలుఁగుచు నున్న కజ్జలం బితఁడు జలజాసనుని వదన జలదిమద్యము నందు అలర వెలువడిన పరమామృతం బితఁడు చ. పరివోని సురత సంపదల నింపులచేత వరవధూతతికి పరమమైన యితఁడు తిరువేంకటాచలధిపుఁడు దానె యుండి పరిపాలనము సేయ భారకుండితఁడు రేకు: 0146-03 సాళంగనాట సంపుటము: 02-208 పల్లవి: ఈతఁడు తారక బ్రహ్మమితఁడు మాదేవుఁడు కౌతుకానఁ జెప్పే వినఁగదరే వో జనులు చ. రాముఁడు యిందీవరశ్యాముఁడు నానాసార్వ భౌముఁడు షాశీడశకళాసాముఁడు దోమటిరాక్షసులను తుత్తుమురు సేసినాఁడు కామితఫలములిచ్చి కాచినాఁడు సురల చ. పూర్జుఁడు నీలమేఘవరుఁడు దానమున వి స్తీరుఁడు వాహనసువరుఁడు అర్ణవము దాఁటి రావణాదుల గెలిచినాఁడు నిర్ణయించి చెప్పరాదు నేఁడీతని మహిమ చ. వరుఁడు సీతకు పరాత్పరుఁడు కోదండదీక్షా గురుఁడు దివ్యామోఘశరుఁ డితఁడు నిరతి శ్రీవేంకటాద్రి నెలవై యుండేటివాఁడు సరి భరతలక్షణశత్రుఘ్న సహితుఁడు రేకు:0247-06 పాడి సంపుటము: 03-271 పల్లవి: ఈతఁడు బలువుఁడౌట కివియే సాక్షి యీతఁడు బ్రహ్మమాట కీతఁడే సాక్షి చ. అమరుల మొరాలించి అసుర బాధలు మాన్సె అమరుల కెక్కుడౌట కదియే సాక్షి అమృతము పంచిపెట్టి యాదిలక్షి గైకొనె అమృతమథనమే అన్నిటికి సాక్షి చ. యిందరుండే బ్రహ్మాండాలు యిదె కుక్షి నించుకొనె యిందరి కెక్కుడగుట కిదియే సాక్షి కందువ వరములిచ్చు కడ నెన్నఁడు జెడవు కందువ పురాణాలలో కథలే సాక్షి చ. ఆది బ్రహ్మఁ బుట్టించె మల్ట్రాకుమీఁదఁ దుదఁ దేలె ఆదినంత్య మీతఁడౌట కదివో సాక్షి పాదుగా శ్రీవేంకటాద్రిపై మహిమ వెదచల్లె పాదుకొన్నయినాతని శ్రీపాదములే సాక్షి రేకు: 0352-04 భైరవి సంపుటము:04-306 పల్లవి: ఈతఁడు విష్ణుఁడు రిపు లెక్కడ చొచ్చేరు మీరు చేత చక్రమెత్తినాఁడు శ్రీవేంకటేశుఁడు చ. జలధులు చొచ్చిచొచ్చి సారెఁ బ్రతాపించినాఁడు చలమునఁ బాతాళము సాధించినాఁడు