పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

271 బహుకాలముల మింగి పరవశంబైనాఁడు బహుయోనికూపములఁ బడి వెడలినాఁడు చ. పెక్కుబాసలు నేర్చి పెంపు మిగిలినవాఁడు పెక్కు నామములచే బిలువఁబడినాఁడు పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ పెక్కులాగులఁ బెనఁగి బెండుపడినాఁడు చ. ఉండనెన్నఁడుఁ దనకు ఊరటెన్నఁడు లేక యెండలకు నీడలకు యెడతాఁకినాఁడు కొండలలో నెలకొన్న కోనేటిరాయని యండ చేరెదననుచు నాసపడినాఁడు రేకు: 0349-05 శుద్ధవసంతం సంపుటము:04-289 పల్లవి: ఈడ నిందరికి నేలికై వున్నాఁడు వాడలరేపల్లెవాఁడా వీఁడు చ. భారపువుట్ల పాలుఁబెరుగులు వారలు వట్టినవాఁడా వీఁడు కోరి గొల్లెతల కొలని లోపల చీరలుదీసిన శిశువా వీఁడు చ. ఆవులఁ బేయల నందరియుండ్ల వావిలిఁ గాచినవాఁడా వీఁడు వావు లొక్కటిగా వనితలఁ గూడి వేవేలునేర్చినవిటుఁడా వీఁడు చ. అరుదై శ్రీవేంకటాద్రిమీఁదనుండి వరములిచ్చేటివాఁడా వీఁడు మరిగెలమేల్మంగతో మమ్మేలె సరసుఁడై వుండేజాణా వీఁడు రేకు:0111-05 లలిత సంపుటము: 02-065 పల్లవి: ఈడనుండె నిందాఁకా నింటి ముంగిట ఆడ నెందుఁ బోఁడుగద అప్పుడే యీకృష్ణుఁడుఁ చ. యేడ పూతకిఁ జంపె నింతపిన్నవాఁడంటా ఆడుకొనేరదే వీథి నందరుఁ గూడి వేడుకతో మనగోవిందుఁడు గాఁడుగదా చూడరమ్మ వీఁడు గడు చుల్లరీఁడు పాపఁడు చ. మరలి యప్పటివాఁడె ಮಿಯ್ಗಲು విఱిచెనంటూ పరువులు వెట్టేరు పడఁతులెల్లా కరికరించఁగ రోలఁగట్టితే నప్పుడు మాహరి గాఁడుగదా ఆడనున్న బిడ్డఁడు చ. వింతగాఁగ నొకబండ విఱిచె నప్పటినంటా రంతు సేసేరదివో రచ్చలు నిండి అంత యీశ్రీవేంకటేశుఁడై న మనకృష్ణుఁడట యింతేకాక యెవ్వరున్నా రిటువంటి పాపఁడు రేకు:0028-02 శ్రీరాగం సంపుటము: 01-170 పల్లవి: ఈతఁడఇ9లంబునకు నీశ్వరుఁడై సకల భూతములలోనఁ దాఁబొదలు వాఁడితఁడు చ. గోపాంగనల మెఱుఁగు గుబ్బచన్నులమీఁద చూపట్టుకమ్మఁ గసూరిపూఁత యితఁడు