పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

270 గుదికొన్న బ్రహ్మాండాల గుడ్లఁ బెట్టే హంస సదరపుబ్రహ్మలకు జలజమూలకందము చ. అనంతవేదాలుండేటి అక్షయవటపత్రము ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము కనలు దానవమత్తగజసంహారసింహము మొనసి సంసారభారము దాల్చేవృషభము చ. సతతము జీవులకు చైతన్యసూత్రము అతిశయభక్తుల జ్ఞానామృతము వ్రతమై శ్రీవేంకటాద్రి వరముల చింతామణి తతిగొన్న మోక్షపు తత్త్వరహస్యము రేకు:0010-04 శ్రీరాగం సంపుటము: 01-064 పల్లవి: ఈ విశ్వాంబు యెవ్వరికిఁ దోఁప దిది పావనుల హృదయమునఁ బ్రభవించుఁగానిని చ. ఇమ్మయినపాపంబు లెన్నివలసినఁ బ్రాణి సమ్మతంబున జేయఁ జాలుఁగా కేమి కుమ్మరికి నొకయేఁడు గుదియ కొకనాఁడవును నమ్మితలం చినవిష్ణునామంబుచేత చ. కొదలేనిదురితములు కొండలునుఁ గోటును చెదర కెప్పుడుఁ బ్రాణి చేయుగా కేమి పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లాను హృదయంబు హరిమీఁద నుండినంతటను చ. సరిలేని దుష్కర్మసంఘములు రాసులై పెరుగఁ జేయుచు ప్రాణి పెంచుఁగాకేమి? బెరసి కొండలమీఁదఁ బిడుగువడ్డట్లాను తిరువేంకటాచలాధిపునిఁ దలఁచినను రేకు:0015-05 నాదరామక్రియ సంపుటము: 01-093 పల్లవి: ఈ సురలీ మునులీ చరాచరములు యూ సకలమంతయు నిది యెవ్వరు చ. ఎన్నిక నామము లిటు నీవైయుండఁగ యున్నినామముల వారిది యెవ్వరు వున్నచోటనే నీవు వుండుచుండఁగ మరి యిన్నిటాఁ దిరుగు వారిది యెవ్వరు చ. వొక్కరూపై నీవు వుండుచుండఁగ మరి తక్కిన యీరూపములు తా మెవ్వరు యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ మక్కువ నుండువారు మరి యెవ్వరు చ. శ్రీవేంకటాద్రిపై చెలఁగి నీవుండఁగా దైవంబులను వారు తా మెవ్వరు కావలిసినచోట కలిగి నీ వుండఁగ యీవిశ్వపరిపూరు లిది యెవ్వరు రేకు: 9084-01 దేవగాంధారి సంపుటము: 04-587 పల్లవి: ఈజీవునకు నేది గడపల తనకు నేజాతియును లేక యిట్లున్నవాఁడు చ. బహుదేహ కవచములఁ బారవేసినవాఁడు బహుస్వతంత్రముల నాపద నొందినాఁడు