పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

269 ఆదికి ననాది హరిమూయ సాదించి సుజ్ఞాని యైతే యీదెస వెదకిన యిహమే పరమూ చ. బలిమేది భవములఁ బాయఁగ కలిగి నట్లేల్లాఁ గర్మంబు నిలుకడలో నిర్మలుఁడైతే వలసిన చోటనే వాఁడికి సుఖము చ. తని వేది తగుబోగములకు తనలోపలనే దైవికము చనవుననూ శరణు చొచ్చితే వెనుకొనె నిదె శ్రీ వేంకట విభుఁడు రేకు:0010-06 శ్రీరాగం సంపుటము: 01-066 పల్లవి: ఈ పాదమేకదా యిలనెల్లఁ గొలిచినది యీ పాదమే కదా ఇందిరా హస్తముల కితవైనది చ. ఈ పాదమేకదా ఇందరును మొక్కెడిది యీ పాదమే కదా యీగగనగంగ పుట్టినది యిూ పాదమే కదా యెలమిఁ బెంపొందినది యీ పాదమే కదా యిన్నిటాకి నెక్కుడైనది చ. యీ పాదమే కదా యిభరాజు దలఁచినది యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది యీ పాదమే కదా యీబ్రహ్మగడిగినది యీ పాదమే కదా యెగసి బ్రహ్మండమంటినది చ. యీ పాదమే కదా యిహపరము లొసగెడిది యీ పాదమే కదా ఇలనహల్యకుఁగోరికైనది యీ పాదమే కదా యీక్షింప దుర్లభము యీ పాదమే కదా యీవేంకటాద్రిపై నిరవైనది పె.అ.రేకు:0075-03 గుజ్జరి సంపుటము: 15-431 పల్లవి: ఈ యీ యీ యీ యీ యీ యీ యీ యీరీతి నాగుణము నాయందే తగిలెను చ. మనస్సుననే నినుఁ దలఁచి మాటలఁ గొసరుదును వొక్కొకపరి వినయముతో నీకు వేవేలు మొక్కులు మొక్కుదును వొక్కొకపరి ఘనంబగు భక్తిని బయలుకౌగిట నలముదును వొక్కొకపరి తనియక వేడుకతోను దైవమా నినుఁబొగడుదును చ. జగత్తున నే నిను వెదకి సారెకు నవ్వదును వొక్కొకపరి పగటున నీ నామములు పాడుచుఁ జెలఁగుదును తగులుచు నినుఁ బూజించి తగఁ బ్రియమునఁ జొక్కుదును వొక్కొకపరి నిగమములను నిన్ను విని నీరజనాభా వెఱగందుదును చ. అంతట నీ మహిమ గని అటు నీ దాస్యమె కొరుదును వొక్కొకపరి చెంతల నీ దాసులఁ జూచి సేవ సేసి నిను నడుగుదును వొక్కొకపరి అంతరంగము శ్రీవేంకటేశ అలమేల్మంగతోఁ బొడచూపితివి సంతసమున నే నీ పాదములకు శరణుచొచ్చి నేబ్రదికితిని రేకు: 0152-05 పాడి సంపుటము:02-244 పల్లవి: ఈ రూపమై వున్నాఁడు యీతఁడే పరబ్రహ్మము శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుఁడు చ. పొదలి మాయాదేవిపట్టిన సముద్రము అదె పంచభూతాలుండే అశ్వత్తము