పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

268 చ. యెందు జనించిన నేమి యొచ్చోట నున్న నేమి కందువ నీదాస్యము గలిగితేఁ జాలు అంది స్వర్గమేకాని అల నరకమేకాని అందపు నీనామము నా కబ్బుటేచాలు చ. దొరయెనఁ జాలు గడుఁదుచ్చపు బంటైనఁ జాలు కరఁగి నిన్నుఁ దలఁచఁగలితేఁ జాలు పరులు మెచ్చిన మేలు పమ్మి దూషించిన మేలు హరి నీసేవాపరుఁడౌటే చాలు చ. యిలఁ జదువులు రానీ యిటు రాక మాననీ తలఁపు నీపాదముల తగులే చాలు యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె చలపట్టి నాకు నీశరణమే చాలు రేకు:0218-02 సామంతం సంపుటము: 03-097 పల్లవి: ఈ తగవే నాకు నీకు నెంచి చూచితే కాతరపు జీవులకుఁ గలదా వివేకము చ. భారము నీది గనక పలుమారుఁ బాపములే చేరి మొక్కలాన నేఁ జేసితిని పేరడిఁ దల్లిదండ్రులు బిడ్డ లేమి సేసినాను వోరుచుక ముద్దు సేసుకుందురు లోకమున చ. కావ నీవు గలవని కడదాఁకా నేరములే వేవేలు సేసితిని వెఱవక భావించుక యింటిదిరెర పసురము దెంచుకొని యేవిధిఁ బైరుమేసినా నెగ్గు సేయఁడతఁడు చ. పుట్టించేవాఁడవు నీవు పొదలేవారము నేము యెట్టుండినా నీకుఁ బోదు యెన్నటికిని వొట్టుక శ్రీవేంకటేశ వోడఁగట్టిన దూలము ಅಟುನಿಟ್ಟು బొరలినా నండవాయు దెపుడు రేకు:0044-01 లలిత సంపుటము: 01–268 పల్లవి: ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానము మోదమెరంగని మోహము ముందర గననీదు చ. నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు సత్యాలాపవిచారము జరగదు లోభికిని హత్యావిరహితకర్మము అంటదు క్రూరాత్మునకును ప్రత్యక్షంబగుపాపము పాయదు కష్టునకు చ. సతతానOదవికాసము సO8)Oచదు తామసునకు గతకల్మష భావము దొరకదు వ్యసనికిని జితకాముఁడు దానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి అతులితగంజనీరగుణం బలవడ దధమునకు చ. శ్రీవేంకటగిరివల్లభు సేవా తాత్పరభావము - ద్రోవ మహలంపటులకు తోఁపదు తలఁపునకు దేవోత్తముఁగడు నీతని దివ్యామృతమగు నామము సేవింపఁగ నితరులకును చిత్తం బొడఁబడదు పె.అ.రేకు:0001-04 మంగళకౌశిక సంపుటము: 15-004 పల్లవి: ఈ దేహికి నింకాను సాదించిన సకలము జయము చ. ఏది తుద యెన్నఁడు ముగుసును