పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

267 చ. చట్టువంటి దీచంచలపు మనసు కొట్టులఁబడేది గుఱిగాదు దిట్ట వొరులు బోధించినఁ గరఁగదు పట్టఁబోయితే పసలేదు చ. చిగురువంటి వీజీవశరీరము తగుళ్లు పెక్కులు తతి లేదు తెగనిలంపటమే దినమునుఁ బెనచును మొగము గల దిదే మొనయును లేదు చ. గనివంటిది యూఘనసంసారము తనిసితన్పినాఁ దగ లేదు ఘనుడఁగు శ్రీవేంకటపతి గావఁగ కొనమొద లేర్పడె కొంకే లేదు రేకు: 0190-06 సాళంగనాటసంపుటము: 02-461 పల్లవి: ఇహమెట్లో పరమెట్లో ఇఁక నాకు సహజమై హరియే శరణము నాకు చ. చిత్తమిది యొకటే చింత వేవేల సంఖ్య పొత్తుల హరిఁ దలఁచఁ బొద్దులేదు జొత్తుల కన్నులు రెండు చూపులైతే ననంతాలు తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు చ. చేతు లివియు రెండే చేష్టలు లక్షోపలక్ష యీతల హరిఁ బూజించ నిచ్చలేదు జాత్రి నాలిక వొకటే చవులు కోటానఁగోటి రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు చ. వీనులివి రెండే వినికి కొలది(లేదు వూని హరిభక్తి విన బుద్ధిలేదు యిూనటన శ్రీవేంకటేశుఁడిటు చూచినను తానే యేలె నిఁకఁ దడఁబాటు లేదు రేకు:0313-04 గుజ్జరి సంపుటము:04-076 పల్లవి: ఇహమే పరము మరి యింతా నీ మయముగాన సహజపుసంసారమే మోక్షము సరుసవిరక్తికి నెడ మేదయ్యా చ. నీయందే బ్రహ్మ మరి నీయందే రుద్రుఁడు నీయందే సచరాచరమును నీయందే యీజగము చాయలనే యెడనెడ నే నేమిచూచినా సర్వము నీధ్యానమేకాక యీయెడ నీయర్ధములో నితరంబిది యాగాదన నెడమేదయ్యా చ. నీ చేఁతలే రాత్రులుఁబగళు నీ చేతఁలే కాలత్రయము నీ చేఁతలే సర్వజంతువుల నిశ్చల చైతన్యములు చేచేత నే చేసినవెల్లా శ్రీపతి నీయాజ్ఞావిధులే యేచాయలఁ బుణ్యపాపములకును యెంచఁగఁ బంచఁగ నెడమేదయ్యా చ. నీశరణాగతి యొక్కటి గలిగిన నిజము గల్లలకు వెఱపేలా ఆశల నీవంతర్యామివిగన అందిన దేహమె వైకుంఠము రాసికి నెక్కిన శ్రీవేంకటగిరిరమణుఁడ నీ వుపదేశమిది యీశ పరాత్పర తనిసితి మిందే యిఁక నొకటి గోర నెడమేదయ్యా రేకు:0132-05 లలిత సంపుటము: 02-131 పల్లవి: ఇహమేకాని యిఁకఁ బరమేకాని బహుళమై హరి నీపై భక్షే చాలు