పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

266 చ. భవసాగరములఁ బాపెడిది తేప భువి నజ్ఞానముపులివాకట్టిది జవళి నాశాపాశములకుఁ గిరెడువలి నవనీత చోరునామం బొకటే చ. చింతాతిమిరముఁ జెరిచేటి సూర్యుఁడు అంతట దరిద్రపూత్రపు నిధానము వింతమరణభయ వినాశమంత్రము మంతుకు హరినామంబిది యొకటే చ. మించు దు:ఖములమృత సంజీవని అంచలఁ బంచేద్రియములు కంకుశము యెంచగఁ శ్రీవేంకటేశు దాసులకు బంచిన పాళ్లఁ బరగినదొకటే రేకు:0149-03 పాడి సంపుటము:02-225 పల్లవి: ఇహపరసాధన మీ తలఁపు సహజజ్ఞానికి సతమీ తలఁపు చ. సిరులు ముంగిటను జిగిఁ దడఁబడఁగా హరిని మఱువనిది యది దల(ప) సలిఁ గాంత్రలెదుట సందడిగొనఁగా తిరమయి భ్రమయనిదే తలఁపు చ. వొడలి వయోమద ముప్పతిల్లినను అడఁచి మెలుగుట యది దల(ప) కడ(గుచు సుఖదుఃఖములు ముOచినను జడియని నామస్మరణమే తలఁపు చ. మతి సంసారపుమాయు గప్పినను అతికాంక్షఁ జొరనిదది తలఁపు గతియై శ్రీవేంకటపతి గాచిన సతతము నితనిశరణమే తలఁపు రేకు:0206-04 వసంతవరాళిసంపుటము: 03-034 పల్లవి: ఇహముఁ బరముఁ జిక్కె నీతని వంక అహిశయనుని దాసులంతవారు వేరీ చ. సిరి కలిగినవారు చింతలిన్నిటనుఁ బాసి నిరతపు వర్గ(గర్వ?)ముతో నిక్కేరటా సిరికి మగఁడయిన శ్రీపతి యేలి మమ్మరయుచునున్నాఁడు మా యంతవారు వేరీ చ. బలవంతుఁడైనవాఁడు భయము లిన్నిటఁ బాసి గెలిచి పేరు వాడుచుఁ గెరలీనటా బలదేవుఁడైన శ్రీపతి మా యింటిలోన అలరి వున్నాఁడు మా యంతవారు వేరీ చ. భూము లేలేటివాఁడు భోగములతోఁ దనిసి కామించి యానందమునఁ గరఁగీనటా సేమముతో భూపతైన శ్రీవేంకటేశుఁడు మాకు ఆముకొనివుండఁగా మాయంతవారు వేరీ రేకు:0098-04 సామంతం సంపుటము: 01-492 పల్లవి: ఇహమునుఁ బరమును యిందే వున్నవి వహికెక్కఁ దెలియువారలు లేరు