పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

265 చ. కనురెప్పల తుదలఁ గట్టువడెఁ గాలము ఘనమై చేతులతుదఁ గర్మమున్నది మనసు కొట్టఁగొననే మరి దైవమున్నాఁడు చెనకి యిఁక నెన్నఁడు సేయరో పుణ్యములు చ. కనకము దాఁటితేనే ఘన సుఖమున్నది వెనక చీఁకటికొన వెలుఁగున్నది వనితల అవ్వలనే వరవిజ్ఞాన మున్నది పనిగొని యితవైతే బ్రదుకరో జీవులు చ. కాయము కొట్టఁగొననే ఘన వైకుంఠమున్నది బాయట శ్రీవేంకటపతి వున్నాఁడు మాయలకొనలనెల్లా మనము నున్నారము పాయక తెలుసుకొని పట్టరో యీ తెరువు రేకు:0294-04 సామంతంసంపుటము: 03-545 పల్లవి: ఇహపరములకును యిది సుఖము సహజావస్టే జరగేటి సుఖము చ. శ్రీరమణుఁడే చింతాయకుఁడని వూరక వుండుట వొక సుఖము కోరకుండఁగా గూడిన యర్థము ఆరయఁ గైకొను టది సుఖము చ. వసముగాని పని వడిఁ దలకెత్తుక అసురుసురుగాని దరిది సుఖము యెసరెత్తుక లేళ్లేవని తోలక పసఁ దనవిధిం గల పాటే సుఖము చ. పెక్కు చంచలము పెనచుక తిరుగక వొక్క సుఖంబౌ టురుసుఖము యొక్కువ శ్రీవేంకటేశ్వరు శరణని నిక్కితిమిదె మా నిజమే సుఖము రేకు:0266-04 సాళంగనాట సంపుటము: 03-380 పల్లవి: ఇహపరములు గొన నీ దేవుఁడే సహజ మిన్నిటాను సర్వేశుఁడే చ. తలఁచి చూచినాను తనలోనే మఱచిన (నా?) తలఁపుల కొనవాఁడు దైవ మొకఁడే పలికి చూచినాను పలుకక మూనినాను పలుకుల కొనవాఁడు పరమాత్ముఁడే చ. కనుగొని చూచినాను కనురెప్ప మూసినాను కనుచూపు కొనవాఁడు కమలాక్షుఁడే విని యూలకించినాను వినకట్టె మానినాను వినుకుల కొననెల్లా విష్ణుఁడొక్కఁడే చ. మేలుకొని వుండినాను మించి నిద్దిరించినాను కాలము కొనలవాఁడు ఘనుఁడీ హరే యీలాగు శ్రీవేంకటేశుఁ డెదలోన నున్నవాఁడు కీలు విచారించితే కృష్ణుఁడితఁడే రేకు: 0303-04 శుద్ధవసంతం సంపుటము:04-016 పల్లవి: ఇహపరసాధన మిది యొకటే సహజపుమురారిసంకీర్తన నొకటే