పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

264 జవళి నెంచిచూచితే సరిబేసి వంటివి చ. అంగనల చూపులు ఆరతులవంటివి కుంగక నీవు కొలువై కూచున్న వేళ చెంగట లేఁతనవ్వులు సేసపాలవంటివి కొంగులు వట్టుచు నీవు కొసరేటివేళ చ. కాంతల పలుకులెల్లా కప్పరాలవంటివి అంతలో నీవు సరసాలాడేటివేళ బంతిమోవుల యీవులు పాలకూళ్లవంటివి మంతనాననుండి నీవు మన్నించేవేళను చ. వెలఁదుల కాఁగిళ్లు విడిదిండ్లవంటివి చలముల నీ రతులు సలిపేవేళ యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి తలఁపులవంటివన్నీ తమకపువేళను పె.అ.రేకు:0074-06 సాళంగంసంపుటము: 15-428 పల్లవి: ఇవియే తొల్లిటివారు యెంచి నడచిన శాంతి వివరించి కొలిచితే విష్ణుఁడే శాOత్రి చ. సకలవుద్యోగములుఁ జాలించుటే శాంతి సుకదుఃఖములు విడుచుటే శాంతి వొక రేమి యిచ్చినాను వొల్లకుండుట శాంతి ప్రకటించి రచ్చలకుఁ బాయుటే శాంతి చ. మహిమీఁది పనులెల్లా మానియుండుటే శాంతి సహజబాంధవములు జారుటే శాంతి బహుకుతర్కములకుఁ బారకుండుటే శాంతి విహితవిషయముల విడుపాటే శాంతి చ. వూరకే నిశ్చింతమున నుండఁగలదే శాంతి కోరకుండే సాత్వికగుణమే శాంతి భారము శ్రీవేంకటేశుపై బెట్టుటే శాంతి ధీరతతోడుత గుణాతీతుఁ డౌటే శాంత్రి రేకు: 0369-02 భూపాళంసంపుటము:04-405 పల్లవి: ఇవియే పో ప్రద్యుమ్నయిహ పర సాధనము భవ జలధుల తేప పరమయోగులకు చ. వామన గోవింద విషు వాసుదేవ హరి కృష్ణ దామోదరాచ్యుత మాధవ శ్రీధరా నీమహిమ గానలేము నిన్నెంచంగలేము నీ - నామజపమే చాలు నాలుక సులభము చ. అనిరుద్ధ పురుషోత్తమాధోక్షజ ఉపేంద్ర జనార్ధన కేశవ సంకర్షణా నినుఁ దలఁచఁగ లేము నిన్నుఁ దెలియఁగ లేము నునుపై నీనామమే నోటికి సులభము చ. నారాయణ పద్మనాభ హృషీకేశ నారసింహ మధుసూదన త్రివిక్రమ నీరూపు భావించలేము నిక్కపు శ్రీ వేంకటేశ ఆరయ నీనామజప మన్నిటా సులభము రేకు:0254-01 లలిత సంపుటము: 03-308 పల్లవి: ఇవ్వల వెదకితేనే యేమి లేదు అవ్వలికి దాఁటి మీరు అందుకోరో శుభము