పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

282 చ. కొంత నా కర్మఫలము కొంత నీ రక్షకత్వము యింతలో రెండు గలవా యేమో దేవా అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను చెంతఁ గాచుట నీపని సేవసేయ నాపని చ. నేనపరాధి నయ్యేది నీవు వహించు కొనేది యిూ నెపాలు రెండూ నేల యేమో దేవా మానక యిట్లయితే నీ మహిమకు గురుతేది ఆని చింతించే నందుల కపకీర్తి యనుచు చ. మొదలే నా యధమము మీ ఘనత యెంచి కావు యిదియే నా విన్నపము యేమో దేవా యెదుట శ్రీవేంకటేశ యిన్నిటా నీ బంటు బంట పదివేలు నా నేరాలు పట్టకుమీ యిఁకను రేకు:0090-01 సాళంగం సంపుటము: 01-441 పల్లవి: ఉన్నవిచారములేల వోవో సంసారులాల యిన్నిటి కితఁడే రక్ష యిదే మీకు మనరో చ. తక్కక బ్రహ్మలఁగన్న తండ్రిఁ గొలిచి మీరు యొక్కువ సంతతిగల్గి యీడేరరో అక్కున లక్షీనారాయణులఁ దలఁచి మీరు చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో చ. భవరోగవైద్యుని పాదములు సేవించి భువి రోగములఁ బాసి పాందలరో తవిలి పదిదిక్కులు తానైన వానిఁ గవిసి పొగడి దిక్కు గలిగి బ్రదుకరో చ. తల్లిదండ్రీ నీతఁడే తగఁ జుట్ట మీతఁడే యెల్లగాఁ బుట్టించి పెంచేయేలి కీతఁడే చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము కొల్లగా మీరెల్లా మమ్మ గుఱిగా వర్ధిల్లరో రేకు:0177-03 గుజ్జరి సంపుటము:02-384 పల్లవి: ఉపకారి దేవుఁడు అపకారి గాఁడు దేహం బొసంగెను దేవుఁడు తనుఁ దెలియఁగ శాస్త్రము గడియించె దేహాంతరాత్ముఁడు మరి దేహచైతన్యుఁడా దాను దేహి యేలోకంబున కేఁగిన దేవుఁడు దా వెంటనే యేఁగును దేహి కోరినట్టే కమ్మర దేవుఁడనుమతి ఇచ్చీఁ గాన చ. చేయుటకును చేయకమానుటకును జీవుఁడు స్వతంత్రుఁడా యంటేను కాయపుసుఖములు గోరఁగ గర్తట కడగనుటకుఁ గర్త గాఁడా యీయెడ నాయెడనంతర్యామే యిన్నిటికినిఁ బ్రేరకుఁడింతే దాయక పాయక తనతలఁపుకొలఁది దైవమే సృజియించీఁ గాన చ. ఇవి యెరిఁగి చిత్తమా నీ వితనందే అభిరతి సేయుము సదయుఁడు మనశ్రీవేంకటగిరి సర్వేశ్వరుఁడు సత్యుఁడు మొదలనే యీయర్థము కిరీటితో మొగి నానతి ఇచ్చినాఁడు అదే "నమోబ్రహం సర్వభూతేషు" అని గీతలలో నున్నది గాన రేకు:0024-06 ధన్నాశి సంపుటము: 01-148 పల్లవి: ఉప్పవడము గాకున్న రిందరు యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు చ. కన్నుల చంద్రుఁడును కమలమిత్రుఁడును