పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

260 పల్లవి: ఇప్పుడు నమ్మునవారి కింతకంటె సులభుఁడు తప్పక తలఁచుకోరో దైవజ్జలాలా చ. సీతావిరహ మోర్చి శ్రీరామచంద్రుడు భ్రాతయైన లక్ష్మణునిఁ బాయలేఁడాయ ఆతుమ బంధువులకంటె నOడఁ బాయక కొలిచె నీతికైంకర్యపరుఁడే నిజబంధుఁ డాయెను చ. వడి దశరథుఁ బాసి వచ్చిన రాఘవునికి కడు సుగ్రీవుచుట్టరికము గలిగె తడయక కనిపించె తల్లిదండ్రులకంటె నడరిన సేవకుఁడె యంతరంగుఁ డాయోను చ. మచ్చికతో భరతునిమాట మీఱినరాముఁడు మెచ్చి విభీషణు భక్తి మీఱలేఁ డాయో అచ్చపు శ్రీవేంకటేశు అన్నదమ్ములకంటెను తచ్చి శరణాగతుఁడె తగ నిష్టు డాయెను రేకు:0163-03 సామంతం సంపుటము: 02-302 పల్లవి: ఇప్పుడే నే నొడఁబడ మరవఁగఁ దగదు జెప్పితి యెల్లనాఁడు నెప్పున నే నెంతకల్లరినైనా నీదాసుఁడనని యందురుగా చ. మఱతునో తలఁతునో నిన్ను మాఁటల నేతప్ప గలుగునో యొఱఁగక నీదాసులఁజూచి యేమని పలుకుదునో నెఱసిన నాకర్మఫలంబులు నీకు సమర్పణ సేసితిని మఱి నామీఁదట నేరము లెంచక మాధవ నన్నిటు రక్షించవే చ. అలతునో సాలతునో నే నీయందు భక్తి సేతునో సేయనో యెలమిని నీకు నివేదించక యేమేమి భుజియింతునో తలఁచేటి నామనసే నీకును ధనముగాఁ గప్పము వెట్టితిని పలుమరు నన్నును తగవుకుఁ దియ్యక పరమాత్మా ననుఁ గావఁగదే చ. నేరనో నేర్తునో నీకైంకర్యము నేమము లేమేమి మానితినో నీరూపము నే సేవించి యొక్కడ నే ననుమానించితినో మేరతోడ మావారు చెప్పఁగా మిమ్మింతట నే నమ్మితిని వారిఁ జూచైన శ్రీవేంకటేశా వరదుఁడవై మము మన్నించం గదవే రేకు:0089-05 లలిత సంపుటము: 01-439 పల్లవి: ఇరవగువారికి యిహపర మిదియే హరిసేవే సర్వాత్మలకు చ. దురితమోచనము దుఃఖపరిపూరము హరినామమెపో ఆత్మలకు పరమపదOబును భవనిరుపూరణము పరమాత్ముచింతే ప్రపన్నులకు చ. సారము ధనములు సంతోషకరములు శౌలికథలు సంసారులకు కోరినకోర్కియు కొంగుబంగరువు సారె విషుదాస్యము లోకులకు చ. యిచ్చయగుసుఖము యిరవగుపట్టము అచ్చుతుకృప మోక్షారులకు అచ్చపు శ్రీవేంకటాధిప శరణము రచ్చల మాపాలిరాజ్యపు సుగతి రేకు: 0337-04 గుండక్రియ సంపుటము: 04-217 పల్లవి: ఇరవుగా నిన్నెరిఁగిరి యిదివో నీదాసులు