పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

261 పరదైవములమీఁద నొల వేయనేల పనిలేవు నీమాయలు కరుణానిధీ చ. ముంచెను నీపాదములు మూఁడులోకములయందును యొంచెను నీ వేయినామాలు యిలలో వేదవ్యాసుఁడు చంచులఁ దలఁచిరి నిన్ను మున్నేసనకాదియోగీంద్రులు పొంచి యింకా నీకు దాఁగఁ జోటు లేదు యిందు బొడచూపవే యింకవెడమాయలేలా చ. కొనెను నీపాదతీర్ధము బ్రహ్మ కోరి నీపాదము గడిగి వినుతించె నీమహిమ తొల్లె వేయినోళ్లుగల శేషుఁడు అనిరి నిన్నెక్కుడనుచు మొదల శుకాది మునీంద్రులెల్లా పొనిగి నీవు మాయ సేయఁ జోటు లేదు మమ్మ పొసఁగి యేలుకోవె పురుషోత్తముఁడా చ. యెక్కెను ధ్రువుఁడు పట్టము యిదివో నిన్నుఁ గొలిచి చిక్కెను నీశరణాగతి నేఁడు శ్రీవైష్ణవులచేతను గక్కన శ్రీవేంకటేశుఁడా యిట్టె కాచితివి మాటకే మమ్మ యిక్కడ నీమాయ సేయఁ జోటు లేదు నిన్ను నెరిఁగిరి నీదాసు లిందిరారమణా రేకు:0097-04 బౌళి సంపుటము: 01-486 పల్లవి: ఇరవైనయట్టుండు యొఱఁగనీ దీమాయ తెరమఱఁగు మెకమువలె తిరుగు నీబ్రదుకు చ. అనిశమును దేహమును కన్న పానము లిడిన యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో గొనకొన్న మానినుల కూటముల సుఖము లివి మనసుదాటినపాలు మట్టలేదెపుడు చ. వొడలఁబెట్టినసొమ్ము లొగిఁ దనకుఁ గానరా వడవిఁ గాసినవెన్నెలది కన్నులకును వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే బెడిదంపుభ్రమతోడిపెనుగాలిమూఁట చ. చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు యెదుయెనుపోతునై యేకంబు గాదు వొద్దికై శ్రీవేంకటోత్తముఁడు యింతలో అద్దంపునీడవలె నాత్మ బొడచూపె రేకు:0182-04 లలిత సంపుటము:02-413 పల్లవి: ఇల జాణతనము లిన్నిటికిఁ గలదు తలఁపే కులై తగిలీఁ గాని