పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

259 పల్లవి: ఇన్నిళ్ళు నెఱఁగక యిందులోనే వోలాడితి మన్నించఁగా నీవల్లనే మరిగితి నిన్నును చ. ముందు నేఁజేసినకర్మములు దోలుకరాఁగాను అంది మరఁగుఁ జొచ్చితి నందుకే నీకు కందువఁ బంచేంద్రియాలు కదిమి పై కొనఁగాను చందములన్నిటా నీకు శరణంటిని చ. వెనకటి సంసారము విడువక వుండఁగాను వినయాన నీడాగు వేసుకొంటిని ఘనమైన జన్మములు కాణాచియై తగులఁగ మొనసి నీ పాదాలకు మొక్కితి నేను చ. జీవుల సంగాతాలు చిమ్మి రేఁచి యంటుకోఁగా భావించి నీ మీఁదటిబత్తి వట్టితి శ్రీ వేంకటేశుఁడవు నీదేవు లలమేలుమంగ నీవు నాకు బుద్ధియ్యఁగా నిన్నే పాడితిని రేకు: 0372-02 సామంతంసంపుటము:04-423 పల్లవి: ఇన్నివిధాలు యిఁకనేల ప్ర - పన్నుఁడై మీఁద బహువిధులేలా చ. సతతభూతదయ సత్యవాక్యము గలితే కుతిలపు ధర్మాలగొడవలేలా ప్రతిలేనివిజ్ఞానభావశుద్ధి గలిగితే మతకపుఁ గర్మాలు మరియేలా చ. పొందుగ నిన్నిటను సమబుద్ధి నిలిచితేను సందడిలోఁ దీర్గాచరణలేలా నిందమాని యాసమాని నిర్మలచిత్తులయితే వందడైన వుపవాస వ్రతము లేలా చ. శ్రీ వేంకటపతి చింతనము గలిగితే పావనపు శాస్త్రాల పఠనలేలా ఆవల నీతని దాసులందుఁ బ్రేమ గలిగితే కావరపుటితర సంగతులేలా రేకు:0006-03 భూసాళం సంపుటము: 01-038 పల్లవి: ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు నప్పఁడగు తిరువేంకటాద్రీశుఁ గంటి చ. అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి ప్రతిలేని గోపురప్రభలు గంటి శతకోటి సూర్యతేజములు వెలుఁగఁగఁ గంటి చతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి చ. కనకరత్నకవాటకాంతు లిరుగడఁగంటి ఘనమైన దీపసంఘములు గంటి అనుపమమణిమయమగు కిరీటము గంటి కనకాంబరము గంటి గక్కన మేలుకంటి చ. అరుదైన శంఖచక్రాదులిరుగడఁ గంటి సరిలేని అభయహస్తము గంటిని తిరు వేంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటి హరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి పె.అ.రేకు:0047-02 మధ్యవవతి సంపుటము: 15-265