పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

258 పన్ని పరులఁ జెప్పఁగఁ జోటేది చ. కుందని నీరోమకూపంబులలో గొందుల బ్రహ్మాండకోట్లట యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో యిందుఁ బరులమని యెంచగనేది చ. నీ కొనచూపున నెఱిఁ గోటిసూర్యులేకమగుచు నుదయింతురటా నీ కాయమెంతో నీ వునికేదో నీకంటెఁ బరులని నిక్కఁగనేది చ. జీవకోటి నీ చిన్నిమాయలో ప్రావులగుచు నటు పొడమెనటా శ్రీవేంకటేశ్వర చెప్పఁగ నీవెంతో ఆవలఁ బరులకు నాధిక్యమేది రేకు:0005-05 నాదరామక్రియ సంపుటము: 01-034 పల్లవి: ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ జెన్నలర హరిసేవ సిద్దించుకొరకు చ. అరయ వేదాధ్యయన మది బ్రహ్మశుద్దికొర కిరవైనశాస్త్రంబు లెరుకకొరకు తరి యజ్ఞములు రుణోత్తారమయ్యెడికొరకు సరిలేనిదానములు జన్మములకొరకు చ. మమకారదూరంబు మనసు గెలుచుటకొరకు సమవివేకంబు శాంతములకొరకు అమరశ్రీతిరువేంకటాద్రీశుమనసు నీజముగెలుచు బ్రహ్మవిజ్ఞానంబుకొరకు రేకు: 0311-04 ముఖారి సంపుటము:04-064 పల్లవి: ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల కన్ను దెరచుటోకటి కనుమూయుటోకటే చ. వలెననే దొకమాఁట వలదనే దొకమాఁట సిలుగులీ రెంటికిని చిత్తమే గురి వలెనంటే బంధము వలదంటే మోక్షము తెలిసే విజ్ఞానులకు తెరువిదియొకటే చ. పుట్టెడిదొకటే పోయెడిదొకటే తిట్టమై యీ రెంటికిని దేహమే గురి పుట్టుట సంశయము పోవుట నిశ్చయము వొట్టిన విజ్ఞానులకు నుపమిది యొకటే చ. పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే సిరుల నీ రెంటికిని జీవుఁడే గురి యిరవై శ్రీవేంకటేశుఁ డిహపరములకర్త శరణాగతులకెల్ల సతమివాతఁ డొకఁడే రేకు: 0383-03 లలిత సంపుటము: 04-484