పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

257 సన్నల నే నెటువలె సాధింతు నయ్యా చ. యెందును బలవంతము యింతుల చుట్టరికము అందునకంటే వాలాయ మాహారవాంఛ అందిన పిసిఁడితన మారెంటికంటె నిష్టతి కందున నే నెవ్వరినిఁ గాద నీ తొత్తునయ్యా చ. వీడని సమ్మంధము వెస దేహానకు నాకు ఆడి కూడిన సంగాత్ర మహంకారము తోడిలంకె యెపుడును దురభిమానములు వాడికేయ నెవ్వరి నీవల కందు నయ్యా చ. మిక్కిలి నేస్తముతొల్లె మించులబంగారము నిక్కముగా ననుబంధి నిర్ణయత్వము వొక్కటై కనుఁగొనుచు వున్నాఁడవు నాలో నీవే యిక్కడ శ్రీవేంకటేశ యెవ్వరి రోతు వయ్యా రేకు: 0327-01 దేశాక్షి సంపుటము:04-154 పల్లవి: ఇన్నిటికి మూలము యెప్పుడు నీవే పన్ని మామీఁద నేరాలు పచరించకువయ్యా చ. కోటానఁగోటులు మదిఁ గోలికలు చీటికి మాటికి నివే చిగిరించీని వాటమై యెవ్వరికిని వసముగావు పాటించి వీటిని వొప్పనగొనవయ్యా చ. లక్షోపలక్షలు కర్మలంపటములు అక్షయపు తీగెలై అల్లుకొనీని వీక్షించ నెన్నేఁ గలవు వింతవింతలు రక్షించ నిన్నిటికి భారము నీదేయయ్యా చ. నానాముఖములు పుణ్యములెల్లాను తానక భోగములై తగిలించీని మానుపరా దలమేలుమంగపతివి శ్రీనాథ శ్రీవేంకటేశ చిత్తగించవయ్యా రేకు:0160–02 మాళవిగౌళ సంపుటము: 02-288 పల్లవి: ఇన్నిటికిఁ బ్రేరకుఁడు యీశ్వరుఁడింతే పన్ని యీతనిఁ దెలిసి బ్రదుకుబే జ్ఞానము చ. మనసునఁ బుట్టిన మంకుఁ గామక్రోధాలు పనిలేవు తనకంటేఁ బాప మంటదు పనివి తొడమ నూడి పండు తీఁగె నంటదు జనులకెల్లాఁ బ్రకృతిసహజ మింతే చ. చేతులారఁ జేసేటి చేకొన్న కర్మానకు ఘాతలఁ గర్తఁ గానంటే కట్టువడఁడు ఆతల నబక మంచినట్టి వేడి చెయ్యంటదు జాతి దేహము మోఁచిన సహజ మింతే చ. వాకున నాడినయట్టి వట్టి పల్లదాలనెల్లా దాకొని పొరయనంటే తప్పలే లేవు పైకొని శ్రీవేంకటేశుబంటుకు వళకు లేదు సైకమైన హరిభక్తి సహజ మింతే రేకు:0215-03 సాళంగనాట సంపుటము: 03-087 పల్లవి: ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె