పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

256 మన్నన కొలఁదినె మలయుటఁ గాక చ. మాయామయమై మనియెడి జగమిది చాయుల నిOదు నిజము గలదా కాయము సుఖదుఃఖములకుఁ బొత్తిది రేయింబగలు నొకరీతే కలదా చ. దైవాధీనము తగు సంసారము వావిరి జీవుల వసమవునా ధావతి మనసిది తన కర్మమూలము వేవేలై నా విడువఁగ వశమా చ. పంచేంద్రియములఁ బరగేటి బ్రదుకిది చంచలంబు నిశ్చలమవునా యెంచఁగ శ్రీవేంకటేశ్వరు కృపతో సంచయమయితే సతమవుఁగాక రేకు:0222-04 వరాళి సంపుటము: 03-123 పల్లవి: ఇన్నిటికి నీశ్వరేచ్చ యింతేకాక తన్నుఁదానే హరి గాచు దాసుఁడైతేఁ జాలు చ. ప్రకృతిఁ బుట్టిన దేహి ప్రకృత(తి?) గుణమే కాని వికృతి బోధించబోతే విషమింతే కాదా వొకవిత్తు వెట్టితే వేరొకటేల మొలచును ప్రకటమైన వట్టిప్రయాసమే కాక చ. పాపానఁ బుట్టిన మేను పాపమే సేయించుఁ గాక యేపునఁ బుణ్యముతోవ యేల పట్టును వేపచేఁదు వండితేను వెస నేల బెల్లమవును పై బలిమి సేసే భ్రమ యింతే కాక పంచమైన పుట్టుగు ప్రపంచమునకే కాక పమించ మోక్షమున కొడఁబడునా పన్నుడైనవేళ భాగ్యాన శ్రీవేంకటేశుఁపుడు దయఁజూడఁగ నధికుఁడౌఁ గాక చ.

రేకు: 0357-03 సాళంగనాట సంపుటము:04-335 పల్లవి: ఇన్నిటికి నోపునా యీ మనసు నన్ను మన్నించి నీమనసు మరిగించు మనసు చ. పొలఁతులకాఁకనే పుటమెక్కె మనసు చలివేఁడిజవ్వనమునంది( జిక్కె మనసు వలరాజుతూపునంజు వడినెక్కె మనసు ములసి రతిసుఖాలమురపాయు మనసు చ. పచ్చనికనకముపై భ్రమఁబడె మనసు చిచ్చువంటివిషయాల శివమెత్తె మనసు వొచ్చెపుఁ బాపాలకెల్లా నొడిగట్టె మనసు బచ్చన చెంచెలములఁ బాటిచెడె మనసు చ. కోరి యంతలో గురుఁడు గూఁటవేసె మనసు వోరుపుతో నీపాలి కొప్పగించె మనసు ఈరీతి శ్రీవేంకటేశుఁడ నామనసు తోరపు విజ్ఞానము తుదకెక్కె మనసు పె.అ.రేకు : 0065-03 సామంతం సంపుటము: 15-372 పల్లవి: ఇన్నిటికి మూలము యిందిరానాయక నీవే