పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

255 వెన్నునినామమే వేదంబాయ చ. నలినదళాక్షునినామకీర్తనము కలిగి లోకమునఁ గలదొకటే యిల నిదియే భజియింపఁగఁ బుణ్యులు చెలఁగి తలఁప సంజీవని యూయ చ. కోరిక నచ్యుత గోవిందాయని ధీరులు దలఁపఁగఁ దెరువొకటే ఘనోరదురితహరగోవర్ధనధర నారాయణ యని నమ్మఁగఁగలిగె చ. తిరువేంకటగిరి దేవుని నామము ధరఁదలపగ నాధారమిదే గరుడధ్వజుని సుఖప్రదనామము నరులకెల్లఁ బ్రాణము దానాయ రేకు:0182-03 శంకరాభరణం సంపుటము: 02-411 పల్లవి: ఇన్నిటా నొరయక యెఱు కేది వెన్నుని కృపఁగా వెలసేది చ. కోపము మతిలోఁగుందినపుడువో పాపము లన్నియుఁ బాసేది తీపుల యాసలు దీరినపుడువో తాపత్రయములు దలఁగేది చ. ఘనకర్మంబులు గడచినపుడువో వెనుకొను భవములు విడిచేది మునుకొని యింద్రియములు వీడినఁబో పనివడి విరక్తి బలిసేది చ. ఆఁకటిరుచు లివి యణఁగినపుడువో చేకొని సుఖమునుఁ జెందేది యీకడ శ్రీవేంకటేశ్వరు శరణము పైకొనిననుఁబో బదికేది రేకు:0274-02 లలిత సంపుటము: 03-425 పల్లవి: ఇన్నిటా శ్రీహరిభక్తి యిది లాభము పన్నిన తపముచేత బడలుటే లాభము చ. యెనయఁ గర్మదేహ మిదెన్ని పాట్లు వచ్చినా ననుభవించి తీరుచు టది లాభము తన పాపవర్తన యితరులెంత నిందించినా ననుమానించక పడుటది లాభము చ. తగు సంసారజీవుఁడు తన్నెంత వేసరించినా నగి రుణము దీర్చుట నానాలాభము చిగురువంటి చిత్తము చేరి యెందు దిప్పినాను తగిలి యలయుటే దక్కినట్టి లాభము చ. శ్రీవేంకటేశ్వరుఁడు జీవములో నుండఁగాను యేవేళ నెట్లయినా నివి లాభము పావనమైనట్టి యాత్మభావమెంత మఱచినా ఆవల నానందించుటది లాభము రేకు:0252-01 మలహరి సంపుటము: 03-296 పల్లవి: ఇన్నిటి మూలం బీశ్వరుఁ డాత్రని