పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

254 వున్నది వున్నటువలె నొనరింపపలదా చ. చెప్పు గాక ప్రకృతిని చేరి నాలువేదము(ల గప్పి యనిర్వాచ్యమని కద్దా కొంత అప్పటి వుపనిషత్తు లన్ని ముఖ్యము గాక తప్పి కొన్ని యతత్వావేదకము లున్నదా చ. దేవతాయజ్ఞములు బోధించుఁ గాక శాస్త్రములు వ్యావహారికనిత్యత్వ మందు నున్నదా భావింప జగత్తు లెల్లా బ్రహ్మమయ మండ్రు గాక ఆవలఁ బురాణాల మిథ్యావాచక మున్నదా చ. మోక్షఫలాశక్తులని మునులు వున్నారు గాక వీక్షింప విఫలు లని వింటిమా ధాత్రి రక్షించి శ్రీవేంకటేశ రమణతో జీవులను కుక్షిఁ బెట్టుకొన్నాఁ డది గుణము సత్యమా రేకు: 0034-03 శంకరాభరణం సంపుటము: 01-210 పల్లవి: ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే వున్నవారియూవులెల్ల నొద్దికయ్యినా చ. తెగనియాపదలకు దేవుఁడే కలఁడుగాక వగలుడుపఁ బరులవస మయిన్యానా నొగిలి యితరలకు నోళ్ళుదెరచిన నగుఁబాటేకాక మానఁగఁబొయిన్యానా చ. అగ్గలపుదురితాలు హరియే మానుపుఁగాక బగ్గన నొక్కరు వచ్చి పాపఁబొయ్యేరా తగ్గుముగ్గులైనవేళ తలఁచినవారెల్ల సిగ్గుఁబాటేకాక తమ్ముఁ జేరవచ్చేరా చ. యెట్టు నేసినను వేంకటేశుఁడే నేరుచుఁగాక కట్టఁగడవారెల్లఁ గరుణించేరా యిట్టే యేమడిగిన నీతఁడే యొసంగుఁగాక వుట్టిపడి యెవ్వరైనా నూరడించేరా రేకు: 0338-02 వరాళి సంపుటము:04-221 పల్లవి: ఇన్నిజన్మము లెత్తిన యిందుకా నేము పన్నిన సంసారములబంధమే మిగిలెను చ. తీరెఁ దీరె అన్నములు దినదినకోరికలు కోరఁబోతే యాసలెల్ల కోటానఁగోటి సారెఁ గొన్నరుచులెల్ల చవితో మేనిలో లేవు ఆరితేరిబతుకఁగా నాసలే మిగిలెను చ. పోయఁబోయ స్వర్గాదిభోగములు వెనకకే సేయఁబోతే పుణ్యములు సేనాసేన ఆయమంటి వెతకితే నాతుమలోనా లేవు కాయముతో వెంట వెంట కర్మమే మిగిలెను చ. అందెనందె మోక్షము హరిదాసులవల్లను ముందు వెనకెంచితేను మూలమే హరి గొందిం జిక్కె నరకాలు కోపముఁ బాపము(బాసె యిందు నందు శ్రీవేంకటేశుఁడే మిగిలెను రేకు: 0353-06 సామంతం సంపుటము: 04–314 పల్లవి: ఇన్నిటా నింతటా నిరవోకటే