పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

253 కన్నా మన సిది కానదు గాని చ. పాతకకోట్లు భవములు భస్మీ భూతము సేయఁగఁ బొడవొకటే శ్రీతరుణీపతిచింత, నిజముగా యేతరి చిత్తం బెఱఁగదుగాని చ. మరణభయంబులు మదములు మలినీ కరణము సేయఁగఁగల దొకటే హరినామామృత , మందుమీఁది రతి నిరతము నా కిది నిలువదుగాని చ. కుతిలములును దురుణములునుఁ దృణీ - కృతములు సేయఁగ గురుతొకటే పరియగువేంకటపతి సేవారతి, గత్రియని మత్రి గని కానదుగాని పె.అ.రేకు:0002-03 గుజ్జరి సంపుటము: 15-010 పల్లవి: ఇన్ని యుపాయము లింక నేడ కెక్కు శ్రీహరి పన్ని నీ మఱఁగు చొచ్చి పాయకుండీఁ గాక చ. అనంతకోటి జన్మములందుఁ జేసినపాపములు మొనసి నేనొక జన్మమున నీఁగినా ననిచి కర్మానుష్టానము నేఁడు సేయఁబోతే పనివడి ముంతనీట బడబాగ్ని ఆరునా చ. పెక్కు కవిలెల వ్రాఁత కుంభీపాకరెరవాలు వొక్క దేహాననే పొంది వుత్తరించేనా తక్కక నేఁడీ ఘతోరతపములు సేయఁబోతే గక్కన జలధి బుజ్జకాయ నిండేనా చ. బలువై అనాది వేళ్లు వారిన సంసారము తలమోచి నేఁ డింతలో తవ్వివేసేనా నెలవై శ్రీ వేంకటేశ నే నేఁడు పుణ్య మంటితే చెలఁగి పెను గాలికి చింపి చేఁటలడ్డమా రేకు:0027-05 ఆహిరి సంపుటము: 01-166 పల్లవి: ఇన్ని లాగులచేతు లివియపో కడు నెన్నిక కెక్కినచేతు లివియపో చ. గునియుచుఁ దనునెత్తుకొమ్మని తల్లిపై నెనయం జాఁచినచేతు లివియపో కినిసి గొవర్ధనగిరి వెల్లగించినయునుమువంటి చేతు లివియపో చ. పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన యిసుమంతలు చేతు లివియపో పసులఁ గాచుచు గొల్లపడుచుల యమునలో యిసుక చల్లినచేతు లివియపో చ. పరమచైతన్యమై ప్రాణుల కెల్లను యొరవులిచ్చినచేతు లివియపో తిరువేంకటగిరి దేవుఁడై ముక్తికినిరవు చూపెడుచేతు లివియపో పె.అ.రేకు:0052-06 గుజ్జరి సంపుటము: 15-298 పల్లవి: ఇన్నిఁ దమ కల్పితము లితరసమ్మతు లౌనా