పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

252 సన్నుతించేను నేరమి క్షమియించవే హరి చ. దాసుఁడ నంటేఁ గొంత దయ దలఁతువుగాక నీ సరివాఁడ నంటే నీవు గాచేవా వేసరక కొలిచితే వెస మన్నింతువు గాక వాసి వంతు లెంచుకొంటే వశ మయ్యేవా చ. నుతియించితేఁ గొంత పూనుక రక్షింతువు గాక ప్రతి ఘటించితేఁ జలపట్టవా నీవు గతి నీవే యంటేఁ గొంత కైవస మౌదువు గాక యితరుల వేఁడుకొంటే నియ్యకొందువా చ. మొక్కితేనుఁ గొంత నీవు మొగమోడుదువు గాక నిక్కి గర్వాన నుండితే నీవు మెచ్చేవా దిక్కె యలమేల్మంగపతివి శ్రీవేంకటేశ్వర చిక్కి యిట్టె మఱుఁగ చొచ్చితేఁగావ కుందువా రేకు:0070-04 శ్రీరాగం సంపుటము: 01-367 పల్లవి: ఇన్ని జన్మము లేఁటికి హరిదాసు లున్న వూరఁ దా నుండినఁ జాలు చ. హరిభక్తుల యింటియన్నము గొనువారి వరువుడై వుండవలెనన్నఁ జాలు పరిమభాగవత భవనంబులఁ జెడ్డ పురువు దానయి పాండమినఁ జాలు చ. వాసుదేవుని భక్తవరులదాసులు మున్ను రోసినయెంగిలి రుచిగొన్నఁ జాలు శ్రీ సతీశునిఁ దలఁచినవారి దాసానదాఁసుడై వుండఁదలఁచినఁ జాలు చ. శ్రీ వేంకటేశుఁ జూచినవారిశ్రీ పాదసేవకుఁడై యండఁజేరినఁ జాలు యూవిభుదాసుల హితుల పాదధూళిపావనమై సోఁకి బ్రదికినఁ జాలు రేకు:0214-06 దేసాళం సంపుటము: 03-084 పల్లవి: ఇన్ని దేహములఁ బుట్టి యేమి గంటిమి వున్నతపు హరిదాస్య మొక్కటే కాక చ. హీనజంతువైననాఁడు యేనుగై పుట్టిననాఁడు ఆనంద మొక్కటే అంగాలే వేరు యీ నేటి యజ్ఞానము యీ జీవుల కొక్కలాగే జ్ఞానమే యొక్కుడుఁగాక సరిలేని దొకటే చ. నరలోకభోగానకు నరకానుభవానకు సరేకాని మిగులదు చనెఁ దొల్లె (?) గరిమ నేర్పడనందు ఘనమేమి కొంచమేమి హరిదాసుఁడై బ్రదుకుటదియే లాభము చ. బాలుఁడైన యుప్పుడూను పండి ముదిసినప్పుడు కాల మొక్కటే బుద్ధి కడు లేదు ఆలకించి శ్రీవేంకటాధిపతి సేవించి యేలికంటా మొక్కుచుండే దిదియే భాగ్యము రేకు:0046-06 దేవగాంధారి సంపుటము: 01-285 పల్లవి: ఇన్ని నేఁతలకు నిది యొకటే