పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

251 గద్దించి యాడవుండునో కడసారీ తాను చ. తోడఁబుట్టిన మమత తొడఁగి కొన్నాళ్లకు వాడికె పుత్రులమీఁదవలె నుండదు వేడుక వారెవ్వరో వీరెవ్వరో కాని కూడపెట్టీ వీరికే కొట్లాడీ వారికే చ. తల్లిమీఁదఁ గలభక్తి తనకే కొన్నాళ్లకు యిల్లాలుమీఁదవలె నింత వుండదు వెల్లవిరి నది యెంత విచారించ నిది యంత యిల్లుముంగి లొక్కరిది యొరవు వొక్కరిది చ. నీతితో శ్రీవేంకటేశు నిత్యసేవ కొన్నాళ్లకీతల సంసారమంత యితవు గాదు ఆతఁడెట్టు యివియెట్టు అందరూ నెఱిఁగినదే చేతు లొకటిమీఁదట చిత్త మొకయందు పె.అ.రేకు:0020–04 గుండక్రియసంపుటము: 15-114 పల్లవి: ఇన్నాళ్లు నందు నిందు యేమి గంటిని అన్నిటా శరణు చొచ్చి హరి నిన్నుఁ గంటిని చ. అంగనల పసఁ జిక్కి అలయికలే కంటి బంగారువెంటఁ దగిలి భ్రము గంటిని ముంగిటి క్షేత్రము లంటి ముంచి వెట్టి సేయఁ గంటి అంగవించి నేఁ జూచి అంతరాత్మగంటిని చ. చుట్టాలఁ జేరి చూచి సుద్దుల వావులు గంటి మట్టులేని వయసుతో మదము గంటి వట్టి కామ్యములు సేసి వరుస మాయలు గంటి పట్టి నారాయణ యని భక్తి నిన్నుఁ గంటిని చ. వింత చదువులవల్ల వేరే మతములు గంటి పంతపు కర్మమువల్ల పాపము గంటి యింతట శ్రీ వేంకటేశ యిటునా జీవభావము చింతించి అందులో నీ శ్రీపాదములు గంటి రేకు:0154–05 కాంబోది సంపుటము: 02-256 పల్లవి: ఇన్నాళ్లు నందునందు నేమి గంటివి అన్నిటా శరణు చొచ్చి హరి నిన్నుఁ గంటిని చ. అంగనల పసఁజిక్కి అలయికలే కంటి బంగారువెంటఁ దగిలి భ్రము గంటిని ముంగిటిక్షేత్రాలంటి ముంచి వెట్టిసేయఁ గంటి అంగపు నన్నే చూచి అంతరాత్మఁ గంటి చ. చుట్టాలఁ జేరి చూచి సుద్దులవావులు గంటి మట్టులేని వయసుతో మదము గంటి వట్టికామములుసేసి వరుస మాయలు గంటి పట్టి నారాయణాయని భక్తి నిన్నుఁ గంటిని చ. వింతచదువులవల్ల వేవేలుమతాలు గంటి సంతకర్మములవల్ల సాము గంటిని యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము చింతించి అందులోన నీ శ్రీపాదాలు గంటి పె.అ.రేకు:0061-03 సాళంగనాట సంపుటము: 15-348 పల్లవి: ఇన్నాళ్లు నా యహంకార మెఱుఁగని దాయె నన్ను