పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

250 పల్లవి: ఇదె వీఁడె కంటిమమ్మ యేతులవాఁడు కదలే సూర్యచంద్రుల కన్నులవాఁడు చ. సెలవి నవ్వులవాఁడు చేకత్తిగోళ్లవాఁడు పలు పేగుల జంధ్యాల పంతాలవాఁడు యెలమిఁ జెలిఁదొడపై నిడుకొన్నట్టివాఁడు చెలఁగిన ఘననారసింహుఁడటే వీఁడు చ. కొండగద్దెమీఁదివాఁడు గొప్పకిరీటమువాఁడు దిండుపైఁడిచీరకాశ(సె?) తెక్కులవాఁడు రెండురూపులొకటైన రీతుల మాయలవాఁడు అండఁ బ్రహ్లాదవరదుఁ డాతఁడటే వీఁడు చ. భవనాసి పొంతవాఁడు భావించఁ దెల్లనివాఁడు ఇవల శ్రీవేంకటాద్రి నిరవైనాఁడు జవళిపంతాలవాఁడు శంఖుచక్రములవాఁడు త్రివిరిన అహోబలదేవుఁడటే వీఁడు పె.అ.రేకు:0043-07 సామంతంసంపుటము: 15-246 పల్లవి: ఇద్దరము నిద్దరమె హృషీకేశ యిద్దె సనకాన వచ్చె హృషీకేశా చ. ఏఁటికోయి మాతో హృషీకేశ యీటువెట్టేవు సతుల హృషీకేశ యీటారదు మాపాందు హృషీకేశ నీపై యేటి దియ్యమింక నేము హృషీ కేశ చ. ఇచ్చకురాలను నేను హృషీకేశ నిన్ను నెచ్చుకుందులాడఁ జాల హృషీకేశ ఇచ్చితి వింత చనవు హృషీకేశ నీకు నెచ్చరించే మరవకు హృషీకేశ చ. యేల నీకు మఱుఁగులు హృషీకేశ నన్ను నీలాగునఁ గూడితివి హృషీకేశ యేలితి శ్రీవేంకటాద్రి హృషీకేశ యీలీలనే వుండుమీ హృషీకేశ పె.అ.రేకు:0026-02 దేశాక్షి సంపుటము: 15-148 పల్లవి: ఇద్దరు దేహసంబంధ మిదిగో మాయ గద్దించి యేడ నుండునో కడసారి తాను చ. తోడఁబుట్టిన మమత తొడఁగి కొన్నాళ్లకు వాడిక పుత్రులమీఁదవలె నుండదూ వేడుక వారెవ్వరొ వీరెవ్వరొ కాని కూడ పెట్టి వీరికి కొట్లాడి వారికి చ. తల్లిమీఁదఁ గల భక్తి తనకె కొన్నాళ్లకు యిల్లాలిమీఁదవలె యింత వుండదు వెల్లిలిరి నిది గొంత విచారించనిది గొంత యిలు ముంగి లొక్కరిది యొరవు వొక్కరిది చ. నీతితో శ్రీ వేంకటేశు నిత్యసేవ కొన్నాళ్లకు యూత్రల సంసారమెంత యితవు గాదు ఆతఁ డెట్టు యిదియెట్టు అందరూ నెఱిఁగినదె చేతులొక్కరియందు చిత్త మొక్కరియందు రేకు:0116-02 సామంతం సంపుటము: 02-092 పల్లవి: ఇద్దరు దేహసమ్మంధ మిదివో మాయ