పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

249 రేకు: 0269-03 బౌళి సంపుటము: 03-397 పల్లవి: ఇదె చిక్కితివిఁక నెందు వోయెదవు వుదిరి తొలఁగరాదోహో నీవు చ. జీవుల లోపలఁ జెలఁగేటి మూర్తివి దేవతలకు పరదేవుఁడవు కైవల్యమునకుఁ గలుగు బ్రహ్మమవు ఆవలి పరమున కర్థమవు చ. ఘనకర్మమునకుఁ గలిగిన ఫలమవు మనసు లోనికిని మాయవు తనియని చదువుకు దాఁచిన ధనమవు మునుప జగములకు మూలమవు చ. వలసినవారికి వర్ణించు రూపవు(???) సులభులకు సంసారసుఖమవు అలరిన దాసులమగు మాకైతే కలిగిన శ్రీవేంకటపతివి రేకు:0232-03 మంగళకౌశిక సంపుటము: 03-182 పల్లవి: ఇదె నీ కన్నుల యెదిటికి వచ్చితి కదియుచు నెట్టయినఁ గావకపాశీదు చ. పరమపురుష నీ భక్తి దొరకకే యిరవగు జన్మము లెత్తితిని హరి నీ కరుణకు నరుహము లేకే దురితవిదుల సందులఁ బడితి చ. జగతీశ్వర నీశరణము లేకే వొగి సంసారపువురిఁ బడితి భగవంతుఁడ నీ పదములు గనకే తెగని పాపముల తీదీపు లైతి చ. గోవిందుఁడ నినుఁ గొలువఁగ నేరకే ధావత్రి యూసలఁ దగిలిత్రిని శ్రీవేంకటేశ్వర చేరి నీవు నాదైవమవుగాఁగ ధన్యుఁడ నయితి పె.అ.రేకు:0056-01 గౌళ సంపుటము: 15-318 పల్లవి: ఇదె నీ చిత్తం బింక నాభాగ్యము యిన్ని విన్నపము లిందునే వున్నది హృదయములోపల నీ వున్నాఁడవు యెఱుఁగని యర్ధం బించుక లేదు చ. మొగినా యుష్యము నూరేండ్లు ఇంక ముందరఁ జేసెదఁ బుణ్యము లనుచును తగనా యిచ్చల వలసినట్లనేఁ దప్పెననక భోగించితిని జిగి నొకదేవత ననుచరించను సేసిన ధర్మం బొకటీఁగానను నిగిడి వృద్దు నైతి నింతలోనను నీ ముందర నే నిలిచితిని చ. అనేక కాలము బ్రహ్మకల్పము నడల యందు నే జన్మించి ముక్తివడతు నని పొనుఁగుచు నిహమే కోరుచు నాసల పుట్టుగులకు నొడి గట్టితిని అనిశము మునులను అవలింబించను ఆధార మొక్కటి సంపాదించను తనిసి యిదివో దుర్బలుఁడ నైతినీ దయాదృష్టినే తగిలితిని చ. శ్రీవేంకటగిరి పరమపావనము చేరి యందు నీ సేవ సేతు నని త్రోవ చూచుకొని యిన్నాళ్ల(?) దనేక దొరకొని వేడ్కల మెలఁగితిని భావములోనొక యుక్తియు వెదకను పరులు నాకు రక్షకు లని తలఁచను చేవమీఱి నిర్బరుఁడ నైతిని శ్రీసంకల్పాశ్రీతుఁడ నైతిని రేకు: 0199-01 నాట సంపుటము:02-508