పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

248 రేకు:0050-05 శ్రీరాగం సంపుటము: 01-308 పల్లవి: ఇదివో సంసారమెంత సుఖమో కాని తుదలేని దుఃఖమను తొడవు గడియించె చ. పంచేద్రియంబులను పాతకులు దనుఁదెచ్చి కొంచెపు సుఖంబునకుఁ గూర్పఁగాను మించి కామంబనేడిమేఁటి తనయుండు జని యించి దురితధనమెల్ల గడియించె చ. పాయమనియెడి మహపాతకుఁడు తనుఁ దెచ్చి మూయుOపు సుఖమునకు మరుపఁగాను సోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁ బోయి యీనరకమనుపురము గడియించె చ. అతియుండగువేంకటాద్రీశుఁడను మహహితుఁడు చిత్తములోన నెనయంగాను మతిలోపల విరక్తిమగువ జనియించి యప్రతియయు మోక్షసంపదలు గడియించె రేకు:0131-01 పాడి సంపుటము:02-121 పల్లవి: ఇదివో సుజ్ఞానము 'సూత్రే మణిగణా యివ' గాన మది నితరమే లేదు మాయల 'యద్భావం తద్భవతి' చ. యెదుటఁగను యీజగము యీది నీవన వెఱతును అది వీపరీతజ్ఞానము 'యద్దృష్టం తన్నఫ్టము' గాన పొదులుచుండేటి యీజగము పొసఁగ నీవు గావన వెఱతు యిది విపరీతజ్ఞానము సదసచ్చాహం' బంటివి గాన చ. నిండిన యీజీవులు నీవేయన వెఱతును దండనే బదులు వీరు 'ద్వాసుపర్ణ' వున్నది గాన మెండగు యివాజీవులను మీరు గారన వెఱతును వుండెడి వీరలు నిత్యులు వొగి 'నహమాదిశ్చమధ్యము' గాన చ. యిది మునుపె నీచిక్కు యిందుకు ద్రిష్టం బొక్కటె తుదఁ దొల్లె నీదాసులు గలరు తుదఁ దొల్లియే నీవుఁ గలవు వెదకు మా శ్రీవేంకటపతి నిను సేవించఁగ నిను సేవించఁగను అదన నిన్నంటినవారల నీయంతలు సేతువుగాన రేకు:0285-03 వరాళి సంపుటము: 03-490 పల్లవి: ఇదె చాలదా మమ్ము నీడేర్చను అదన నెవ్వఁ డెరుఁగు నటమీఁది పనులు చ. ఇట్టె పంచసంస్కారా లెచ్చోట నుండినాను పట్టెనవారే మాకుఁ బ్రమాణము మట్టుగ నీరూపనామము లెందు నుండినాను కట్టఁగడవారైన ఘనపుణ్యులు చ. పలుక వైష్ణవవేషభాష లెందు నుండినాను వలనుగ మాకు సహవాసయోగ్యులే తలకొన్న దాసానుదాస్య మెందు నుండినాను అల కర్మదూరులైన నంతరంగులు చ. యొక్కువ సంకీర్తన మెచ్చోట నుండినాను అక్కడ పరమపద మది భాగ్యము చక్కఁగ వేదశాస్త్రసమ్మతము నిదియే పక్కన శ్రీవేంకటేశు పరమార్ధము నిదే