పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

247 శ్రీవేంకటేశుని మాయఁ జిక్కి లోన నున్నవి రేకు:0119-02 సాళంగనాట సంపుటము: 02-110 పల్లవి: ఇదివో వీధివీధుల నీతని తేరు యెదుట శ్రీవేంకటాద్రిని తేరు చ. చట్టువడఁదోలె నాఁడు సముద్రాలపైఁ దేరు ఫెయిట్టుగాఁ దోలెను పౌండ్రకునిపైఁ దేరు జట్టిగొని తోలె జరాసంధునిపై నదె తేరు కొట్టి తోలె హంసడిచుకులపై(???) తేరు (డిభకడిచికుఁడు - హంసుని సోదరుఁడు) చ. ఘనోరమై కుంగఁగఁ దోలె కులగిరులపైఁ దేరు కౌరవసేనపై దోలె గక్కనఁ దేరు కోరి మధురమీఁద నక్రూరుఁ గూడ తోలెఁ దేరు ఆరసి సంధిమాటలు ఆడఁదోలెఁ దేరు చ. తచ్చి శిశుపాలాది దైత్యులపైఁ దోలెఁ దేరు పెచ్చుగాఁ దోలె రుక్మిణి పెండ్లి తేరు అచ్చపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి చెచ్చెరఁదోలె దిక్కుల సింగారపుఁ దేరు రేకు: 0180-03 లలిత సంపుటము:02-399 పల్లవి: ఇదివో వున్నార మింతట నంతట వెదకి కదియకుమీ విష్ణుని మాయ చ. హరిదాసులము హరికింకరులము కలివరదుని డింగరులము యిరవెఱిఁగితిననక యె(ఱగననక సరి మాగురుతిది సర్వేశు మాయ చ. హితులము శరణాగతులము కేశవ వ్రతులము వైష్ణవమతులము గతి నినుఁ బాసితి కడు నిఁక మామీఁద తతి దయమరవకు దైవము మాయ చ. శ్రీవైష్ణవులము శ్రీవేంకటపతి భావింప నిత్రని పలికరము యూవలనావల నిహపరములకును తోవ దొలఁగుమీ తొలిఁదొలి మాయ రేకు: 0312-05 బౌళిరామక్రియ సంపుటము: 04-071 పల్లవి: ఇదివో శ్రుతిమూల మెదుటనే వున్నది సదరముగా హరి చాటీ నదివో చ. యొనసి పుణ్యము సేసి యే లోకమెక్కిన మనికై భూమియందు మగుడఁ బొడముటే పొనిగి "యా బ్రహ్మభువనా లోకాః పునరావృత్తి " యనెఁ బురుషోత్తముఁడు చ. తటుకున శ్రీహరి తన్నునే కొలిచిన పటుగతితో మోక్షపదము సులభమనె ఘటన "మాముపేత్యతు కౌంతేయ " మహిని నటన "బునర్జన్మన విద్యతే " చ. యిన్నిటా శ్రీవేంకటేశ్వరు సేవె పన్నినగతి నిహపరసాధన మదే మన్నించి యాతఁడే " మన్మనా భవ " యని అన్నిటా నందరి కానతిచ్చెఁగాన