పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

246 ఈలీల శ్రీవేంకటేశ్వరా యిన్నియు నీవు నా కని యెరిఁగితి యేలితివి నాప్రాణంబులు నీవు యిల సర్వోపాయంబులు నీవు రేకు:0165-03 నాదరామక్రియ సంపుటము: 02-314 పల్లవి: ఇదివో నీప్రతాపము యొక్కడ చూచినాఁ దానే యెదిటి బ్రహ్మాండము యిమ్ము చాల దిందకు చ. పనిగొంటే భువిలో నేఁబదియే అక్షరములు కొనాడితే నీగుణాలు కోటూనఁగోటి యొనసి పదునాలుగే యెడమైన లోకములు అనిశము నీవియైతే ననంతమహిమలు చ. మించి నిండుకొంటే నెనిమిదియే దిక్కులు అంచల నీకతలైతే ననేకములు యెంచి చూచితేఁ గలవి పంచమహాభూతాలే ముంచిన నీమాయ తుదమొదలే లేదు చ. వుపమించి తెలిసితే నొక్కటే జగము అపురూపపు నీసృష్టి అతిఘనము అపరిమితపు జీవులణువత్రులైనాను యెపుడు శ్రీవేంకటేశ యొక్కుడు నీదాసులు పె.అ.రేకు:0006-04 దేసాళం సంపుటము: 15-035 పల్లవి: ఇదివో మా యజ్ఞాన మెప్పుడును సహజమే కదివి నీవేనన్నుఁ గరుణించవయ్యా చ. తల్లి చంకనున్న బిడ్డ తమతోఁ జన్ను దాగుతా వొల్లఁడు తండ్రి యెత్తుకో నొగిఁబోతేను మల్లడ నీ మాయలో మరిగిన జీవముల మెల్లనే మీ సేవసేసి మిమ్ముఁ జేరఁ జాలము చ. రెక్కల మరుఁగుపక్షి రెక్కల కిందనే కాని యొక్కదు వద్దనే మేడ యెంత వున్నాను పక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము యొక్కుడైన వైకుంఠ మిది గోరఁ జాలమూ చ. నీరులో నుండేటి కప్పనీటిలోనే వుండుఁగాని వూరకే పరపుమీద నుండ దెంతైనాను ఆరయ సంసారములో అజ్ఞానపు జీవులము బోరన శ్రీ వేంకటేశ బుద్ధి చెప్పి కావవే రేకు:0139-01 భూపాళంసంపుటము: 02-166 పల్లవి: ఇదివో మాయింట నేఁడు యింతసేసెఁ గృష్ణుఁడు అదివో మాయింటాను అంతసేసెఁ గృష్ణుడు చ. గంట వాఁగకుండా నిండఁ గసపు దురిగి మూ యింటివారు నిద్దిరించ నిలుచొచ్చెను అంటివచ్చి వొకదూడ ఆపూరి మేసితేను గంట గణగణ వాఁగెగక్కన మేల్కంటిమి చ. వొక్కరోలు దాపు వెట్టి వుట్టియొక్కి అందుమీఁది చక్కెరలా మెసఁగి మాచంటివానిని వుక్కఁ బట్టి వుట్టిమీఁద నునిచి రోలు దీసె చొక్కితా నెందున్నాడో చొప్ప ఇదే కంటిమి చ. ఆవుల వెళ్ళవిడిచె నవి నేఁ దోలి తేఁబోతే నీవల దూడలఁ దెచ్చి యింటిలోఁ గట్టె దావతి నింతా వెదకి తలుపు దెరచితేను