పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

244 ఉపమలేల శ్రీవేంకటోత్తమ నీ సేవ చేసి కపటము మానితేను కాతువు నన్నును రేకు:0086-02 సాళంగనాట సంపుటము: 01-418 పల్లవి: ఇదియే మర్మము హరి యిందుఁగాని లోనుగాడు పదపడి జీవులాల బదుకరో చ. హరి గానలేరు మీరు అరసెందువెదకినా హరిదాసు లెఱుఁగుదు రడుగరో గరిమెC బ్రత్యక్షము గాఁడు దేవుఁ డెవ్వరికి ధరఁ బ్రత్యక్షము హరిదాసుల గొలువరో చ. చేత ముట్టి గోవిందుని శిరసు వూజించలేరు చేతులార ప్రపన్నుల సేవ సేయరో జాతిగాఁగ విష్ణునిప్రసాద మేడ దొరకీని ఆత్రల వారి బ్రసాద మడుగరో చ. అంతరంగమున నున్నాఁడందురు విష్ణుడు గాని అంతటా నున్నారు వైషువాధికులు చెంతల దదియ్యల చేతియనుజ్ఞ వడసి సంతతం శ్రీవేంకటేశు శరణము చొరరొ రేకు: 0363-01 మాళవి సంపుటము:04-369 పల్లవి: ఇదియే వేదాంత మిందుకంటె లేదు యిదియే శ్రీ వేంకటేశుని మతము చ. విరతియే లాభము విరతియే సౌఖ్యము విరతియే పో విజ్ఞానము విరతిచే ఘనులైరి వినకవారెల్ల విరతిఁబొందకున్న వీడదు భవము చ. చిత్తమే పాపము చిత్తమే పుణ్యము చిత్తమే మోక్షసిద్ధియును చిత్తమువలెనే శ్రీ హరి నిలుచును చిత్త శాంతి లేక చేరదు పరము చ. యెంత చదివినా యెంత వెదికినా యింతకంటె మరి యిఁకలేదు యింతకంటె శ్రీ వేంకటేశుదాసులౌట యెంతవారికైన యిదియే తెరువు రేకు:0365-04 మలహరి సంపుటము: 04-384 పల్లవి: ఇదియే సాధనమిహపరములకును పదిలము మూపాలి పరమవునామO చ. కలి దోష హరము కైవల్యకరము అలరిన మా శ్రీ హరి నామం సులభము సౌఖ్యము శోభన తిలకము పలుమారును శ్రీ పతి నామం చ. పాప నాశనము బంధ విమోక్షము పైపై నిది భూపతి నామం స్థాపితధన మిది సర్వరక్షకము దా(పి రవిుది మూడవ నామO చ. నేమము దీమము నిత్యకర్మమిది దోమటి గోవిందుని నామం