పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

243 యిదివో శ్రీవేంకటేశుఁడు నాకును యేలికయై మన్నించంగను పదిలముగా నాతనిసేవచేసి పరమానందుఁడనయ్యేఁ గాక పె.అ.రేకు:0008-02 సాళంగనాట సంపుటము: 15-045 పల్లవి: ఇదియే కామనిదాన మిదియే మూలధనము యిదియే నమ్మట గాక యితరము లేలా చ. ‘న మే భక్తః ప్రణస్యతి' యనుమాట అమోఘమై నీ వానతియ్యఁగా రమారమణుఁడ రతి నీ దాసుల కెల్ల నమో హి నితరవిచారము లేలా చ. నాఁడు 'మా మేకం శరణం వ్రజ' యనుమాట పోడిమి దిక్కుల నీ వెప్పుడు చాటఁగా నేఁడు నీ దాసులమై నెరవేరితిమి గాక వేఁడి వేఁడి కర్మవువిధులిడ నేలా చ. ఆల యెగక్షేమం వహమ్యహ మ్మనుమాట అలరుచు తుదిపదమై వుండఁగా నెలవై శ్రీవేంకటేశ నిన్నుఁ గొలిచినమాకుఁ గలిగె నీ కరుణ యే కథలు నేలా రేకు:0146-04 శ్రీరాగం సంపుటము: 02-209 పల్లవి: ఇదియే కావలెనని తాఁ గైకొని యిచ్చగించువాఁడే ఘనుఁడు వదలకురో హరిదాసుల మతమిది వర్ణించెద నోవివేకులాలా చ. దేవుఁడు గలఁడని మదిలోఁ దెలియుటే జన్మఫలంబు తావుగ నాతని నెప్పుడుఁ దలఁచుటే తనభాగ్యము శ్రీవైష్ణవధర్మము దప్పక చెలఁగుటయే వైభవము దేవతాంతరంబులన్నియు మానినదియే సుకృతంబు చ. కామక్రోధము లుజ్జగించుటయే కల్యాణానుభవము చేముంచి పాపము సేయక మానుటే చెప్పఁగ లాభము నేమముతోడుత విరక్తుఁడగుటే నిర్మలానందము వేమరు నాచార్యసేవ సేయుటే విచారింపఁగ దాఁచిన ధనము చ. ప్రకృతివికారములకుఁ జొరకుండుటే పరమమైన సాత్వికము సకలబంధములఁ బెడఁ బాసినదే సామ్రాజ్యపదము ప్రకటింపఁగ నలమేలుమంగకును పతియగు శ్రీవేంకటవిభుని అకలంకుఁడై కొలిచియుండుటే యనంతమహిమాతిశయంబు రేకు:0139-06 ముఖారి సంపుటము: 02-171 పల్లవి: ఇదియే బుద్ధి నాకు నింతకంటే మణిలేదు కదిసి నీబంటనంటే కాతువు నన్నును చ. నేరచి నడచేనంటే నేఁ గాను స్వతంత్రుడఁను నేరమి చేసేనంటే నిండును దూరు యీరెంటికిఁ గాక నేను యిట్టె నీకు శరణంటే గారవించి వహించుక కాత్రువు నన్నును చ. వొక్కచో నర్థ మర్ణించుకుండితే జన్మాలు పెక్కు యొక్కేనంటే మోక్షము యేడో యెఱఁగ యొక్కడి సుదులునేల యిచ్చట నీనామము గక్కనఁ బేర్కొంటేఁ దయఁ గాతువుగా నన్నును చ. తపసినయ్యేనంటేఁ జిత్తము కైవశము గాదు చపలసంసారినైతే శాంతి యుండదు