పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

242 సంకెదీర నీతనికి శరణుచొచ్చి వరాలు పాంకముగాఁ జేకొనేరు భూ జనులు నేఁడును రేకు: 0340-02 మాళవి సంపుటము: 04-233 పల్లవి: ఇదిగో రూపై తోఁచీ యిందరియోదుట నివి మదిఁ జేపట్టేదిలేక మానెఁగాని చ. కోపమై పొడచూపుఁ గొంత పాపము దీపమై పొడచూపు దేహ పాపము మాపులు నిదురై చూపు మరికొంత పాపము కైపుగాఁ బరుల నింద కడమ పాపము చ. శాంతమే పుణ్యము సత్యదయే పుణ్యము అంతటాను హరిభక్తి యది పుణ్యము చింతించ వైరాగ్యమే చేతిలోని పుణ్యము మంతనపుజానమే మహిఁగల పుణ్యము చ. హరినామమే ముక్తి యురసి కైకొంటేను ధర నాతనిదాస్యమే తగిన ముక్తి సారిది శ్రీవేంకటేశుఁడే పరతత్వము యిరవై కొలుచుటే యిహ నిత్యముక్తి పె.అ.రేకు:0029-02 శంకరాభరణం సంపుటము: 15-166 పల్లవి: ఇదియె నాకు మత మిది వ్రతము వుదుట్ల కర్మము వొల్గా నిఁకను చ. నిపుణత హరి నే నిను శరణునుటె తపములు జపములు ధర్మములు నేపమున సకలము నీవే చేకొను వుపమల పుణ్యము లొల్లా నే యింకను చ. హరి నీ దాసుఁడ నను కొనుటే నా పరమును యిహమును భాగ్యమును ధర నీ మాయల తప్పుఁదెరువులను వొరగి సుకృతము లొల్లా నే యింకను చ. నారాయణ నీ నామము దలఁచుట సారపుఁ జదువులు శాస్త్రములు యిూరీతి శ్రీ వేంకటేశ నిన్నుఁ గొలిచిత్రి వూరక యితరము లొల్లా నే యింకను రేకు: 0146–05 కేదారగెళ సంపుటము: 02-210 పల్లవి: ఇదియే ఉపాయ మిఁక నాకు నిందులకంటే మఱి లేదు మది నితని దాసుఁడనై మహిమలతోఁ గడుమెఱసేఁ గాక చ. కడచితినా నాజన్మములు గక్కన మానిసినైనంతనే విడిచితినా పాపము సేయక వేవేలుచదివినయంతనే అడఁచితినా సంసారవారధి అఖిలదేవతలఁ గొలిచినయంతనే బడిబడి హరినామము నుతించి నేఁ బావనమయ్యేఁ గాక చ. గెలిచితినా యీమాయను నేఁ గెరలి తపంబులు నేసినంతనే తలఁగితినా నరకములు చొరక ధరయోలా నేలినంతనే తెలిసితినా తత్త్యరహస్యము తిరముగ కులజుఁడనయినంతనే యిలలో శ్రీపతి శరణుచొచ్చి నేనిన్నిటఁ బుణ్యుఁడనయ్యేఁ గాక చ. వదలితినా నాదురుణములు వరుసతోఁ జుట్టాలు గలిగినంతనే వెదకితినా ముక్తిమార్గమును విద్య లెఱిఁగి నేర్చినంతనే