పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

241 కావింపఁ గర్మభక్తులే కారణఫలములు పె.అ.రేకు:0041-01 మాళవిగౌళసంపుటము: 15-231 పల్లవి: ఇది యొక్కటి వివేకులకు యెంచి చూచి తెలియఁగలది అదన నిన్నంటినవారల నీ యంతలఁ జేతువు గాన చ. బ్రహ్మాదిదివిజులకంటె నీ భక్తుఁడధికుఁడని చాటుట గాదా బ్రహ్మలోకమునకంటెఁ బొడవున పట్టము గట్టితి ధృవునిని బ్రహ్మ నీకంటెను నీదాస పరికరమె ఘనమను టిది గాదా బ్రాహ్మణుఁడగు దుర్వాసుఁడంబరీషు పాదములకు మొక్కఁగఁజేసితివి చ. కర్మమార్గములనుండే ఋషులకు కడయోగ్యుఁడు నీదాసుఁడనుచు నర్మిలి ముందరి బ్రహ్మపట్ట మిది హనుమంతునికి కట్టితివి ధర్మములోపల నెక్కుడు వైష్ణవ ధర్మమధిక మని తెలుపట గాదా మర్మపు రాక్షసుఁడగు నా బలికిని మహిఁజెడని భోగము లిచ్చితివి చ. నిఖిలవేదములకంటె నెక్కుడు నీ దాసునిమాటే యనుచు శిఖరప్రతిష్టగా ప్రహ్లాదుని చేచేతనె పొడచూపితిని సుఖులలోన నీ దాసుఁడే సుఖి యని శుకునకు మోక్షం బొసగితివి మఖమూరితి శ్రీవేంకటేశ్వరుఁడ మాపాలిటనే దక్కితివి రేకు:0254-05 గుండక్రియ సంపుటము: 03-312 పల్లవి: ఇదిగా దదిగా దిన్నియు నింతే పదిఁబది హరి నీపదమే నిజము చ. సురలును నసురలు చూపట్టు రాజులు అరసి కనక(:(గ?) గత్రమగువారె సిరుల వీరిఁ గొలిచెదమంటే మఱి కెరలి పరుల రక్షింపఁగఁగలరా చ. పదునాలుగవది బ్రహ్మలోకమును కదిసి నీరుమునుకల పొలము చెదరక యిఁకఁ దముఁ జేరినవారల వుదుటున నిముడుక వుండఁగఁగలరా (దా?) చ. అచ్చుతుఁడవు నీయచ్యుతపద మది యిచ్చట శ్రీవేంకటేశుఁడవు చొచ్చిరి నీశరణు శుకసనకాదులు మచ్చిక నిదిగని మరిగితిమయ్యా రేకు:0223-05 లలిత సంపుటము: 03-130 పల్లవి: ఇదిగాన తన ధర్మ మించుకా వదలరాదు వుదుటున హరివారై వుండవలెఁగాని చ. జాతిచండాలము దీరు జన్మాంతరములను యేతులఁ గర్మచండాల మెన్నఁడూ బోదు యీతల స్వర్గము చొరనియ్యకుండఁగాఁ బ్రిశంకుఁడాతలఁ దాఁ బ్రతి స్వర్గమందు నున్నాఁ డదివో చ. ఆస్తికులయినవారు అట్టె రామునిఁ గూడిరి నాస్తికు లసురకుఁ బ్రాణము లిచ్చిరి ఆస్తికనాస్తికుఁడై తానం దెవ్వరివాఁడూఁ గాక కస్తిఁబడి వాలి వృధాకలహానఁ బొలిసె చ. యింక నొక్కటి గలదు యెదుటనే వుపాయము అంకెల శ్రీవేంకటేశుఁడందే వున్నాఁడు