పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

240 గుఱిగా నా విన్నప మవధరించు గోవింద గోవింద గోవిందా పె.అ.రేకు:0006-01 గుజ్జరి సంపుటము: 15-032 పల్లవి: ఇది నీకు నుపకార మింతగా నేఁ జేసితి కదిసి యీ మే లెంచి కావుమీ నన్ను చ. భూమి నే నొక్కనీచుఁడఁ బుట్టఁగాఁ గదా మీ దయ వేమారు నా మీఁదఁ బారి వెల లెట్టెను నేమపుఁ బుణ్యుఁడ నైతే నీ దయకుఁ బాత్రమేది యేమిటికి రాక మూల నిట వృధావుండుఁగా చ. పుట్టదరిద్రవు నాకు పొంచి సంపదలియ్యఁగా యిట్టె నీ లక్ష్మీపతిత్వ మెన్నికె కెక్కె నెట్టన శ్రీవేంకటేశ నీ దాసుల కతాననే రట్టు కెక్కె పంతము మీఱఁగ రాజ వైతివి చ. చిక్కినే దోషాలు గడుఁ జేయఁగాఁ గా నీ నామము రొక్కముగా నన్నుఁ గాచి రూఢి కెక్కెను దిక్కుల మా వంటి వారి తెగువ సేయ కుండితే యొక్కడ నుండు నీ నామ మే మందునకు వచ్చు రేకు: 0184-01 లలిత సంపుటము:02-421 పల్లవి: ఇది యరుదను నొకఁడిది యరుదని చెప్ప యిది యరుదని విను నెవ్వఁడూ నెఱఁగఁడు చ. పుట్టినవానికినెల్లా భువి మరణము నిత్య మట్టే చచ్చినవారి కవ్వల జననము పుట్టిననాఁడై తేను పొడగానరాదు మేను కొట్టఁగొనఁగానరాదు కొన్నాళ్లే కాని చ. జీవుఁడు నిత్యుఁ డేమిటాఁ జెరుపఁగరానివాఁడు యీవివేకము దెలిసి యేజాతివారైనా దైవికమే నమ్మితమధర్మములఁ బాయరాదు సావధాన మిదియే సంసారయోగము చ. చిత్తమా నీలోపలను శ్రీవేంకటేశ్వరుఁడు పొత్తునఁ గూడున్నవాఁడు పొదిగి పాయకు నీవు యెత్తి నాదేహగుణము ఇది జీవగుణ మిది ఇత్తలాదైన గుణము యిది మఱవకుమీ రేకు:0291-01 దేసాక్షి సంపుటము: 03-524 పల్లవి: ఇది యెరిఁగినవారె యెంచఁగ నీ దాసులు వెదకి తెలుసుకొంటే వేదాంతాల నున్నవి చ. పట్టితే నీ స్వరూపము బయలు లోపల నిండి అట్టే సర్వశక్తితో సాకారముతో యెట్టు దలఁచినాఁ జిత్తాయిత్తమై వున్నాఁడవు వొట్టి ప్రకృతిపురుషు లొగి నీ దేహములు చ. అనంతమైన ప్రకృతి అఖిలవికారములై పనివడి నీ మాయంపై ప్రపంచమై వొసరి జడమై యుండ నొకచో దివ్యమై యుండు నినుపై ఇహపరాలు నీయెశ్వర్యములు చ. జీవుఁ డణువు జ్ఞానము చింతించగా విభువు యీ విధము నానాజీవులివె నీ యందె శ్రీవేంకటేశుఁడ నీవే చేకొన్నచైతన్యమవు