పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

239 పసగా నిత్రనిఁ దనపనికిఁగాఁ బొగడుట యిసుమంత చెలమకు యేతము లెట్టుటా పె.అ.రేకు:0063-03 రామక్రియసంపుటము: 15-360 పల్లవి: ఇది తుద మొదలని యెఱుఁగ రెవ్వరును యెదుట నీ మహిమ యెంతని తలఁతు చ. తరణిచంద్రుల రధంబుల వెంటను గరిమలఁ దిరిగీ కాలమూ వురవడిఁ బ్రాణుల నూర్పులవెంబడి నరుదుగ మెఱసీ నాయుష్యములు చ. నెలకొని యెండల నీడల దండనె తెలుపుచుఁ బొదలే దినములు వెలయఁగఁ జీకటి వెన్నెలమాటున మలసీ సారెకు మాసములు చ. వానలశీతున వాయుమార్గమున యీనుచు నున్నవి యేండ్లు తానక మైనది తలఁపఁగ నీయందు శ్రీనిధి చూడవే శ్రీవేంకటేశ రేకు:0265-04 మంగళకౌశిక సంపుటము: 03-375 పల్లవి: ఇది నమ్మలేఁడు పుణ్యాలేమేమో చేసీ దేహి పొదలి యిందువంకనే పొడవెక్కలేఁడా చ. మంచి మందుగొన్నవాఁడు మహామహారోగముల అంచెలఁ బాసి సుఖియయిన్యానటా అంచితపు హరినామమనే మందుగొన్నవాఁడు పొంచి పాపరోగములఁ బోఁదోలలేఁడా చ. జోడు దొడిగినవాఁడు చొక్కపుటలుగులకు వోడక రణజయము నొందీనటా వాడక హరిదాస్యపు వజ్రపంజరపువాఁడు వీడ జన్మపుటమ్ములు విదలించలేఁడా చ. వైపగుఁ గాణాచిగలవాఁడు దరిద్రముఁ బాసి పైపై సంపదలతో బ్రదికీనటా దాపై శ్రీవేంకటేశు పాదములందుఁ గాణాచి యేపొదూఁగలుగువాఁడు యొక్కువగా లేఁడా పె.అ.రేకు:0071-05 - దేసాక్షి సంపుటము: 15-410 పల్లవి: ఇది నీ మాయో యింద్రజాలమో యేమియు నెఱుంగను సదరపు నా కర్మవశంబున నే సంకల్పించెదనో యెఱుంగను చ. నరకము లనుభవించే యప్పుడు నా యాతనాదేహంబు నరములతో నఱకుదురు యమభటులు నలియ దప్పటిఁ జరుగును సరి నసిపత్రములు నాఁటు నమయ దెంతైనాఁ జిగిరింపుచుండు వరుసఁ దప్తలోహ తైలంబులలో వైతురు పోవదు వెను తగులు చ. అంతట నొకతల్లికడుపునఁ బుట్టదు అతికోమలమగు మేను మోచుకొని వంతుల బాల్య కౌమారయావన వయసులఁ బెక్కు భావము కాదు కాంతలఁ గవయుదు రక్తమాంసములుఁ గమ్మటి నూరునుయోమిటాఁ వింతగా నాహారంబులు గొందును వెన నాఁకలియునుఁ దీరదు చ. మెఱయఁగఁ గలలోన నన్నియుఁ గందును మేలుకాంచితే సటలెను మఱచితిఁ దలఁచతి సర్వాపరాధములు మతి యన్నియునేఁ జేసితిని తటితో శ్రీవేంకటేశ నాపాలిటి దైవము యలమేల్మంగపతి