పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

238 హితవైన శ్రీవేంకటేశ్వరుని శరణని బ్రతుకరా యిందు నందుఁబ్రపన్నులెల్లను రేకు:0069-03 సామంత సంపుటము: 01-360 పల్లవి: ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటా కొత్తసేఁతలెల్ల దొరకొంటిగా నీవు చ. హీనులైనవారు నిన్ను నేచి కొలిచిన ఘన మైన పదవులఁ బెట్టేయెటువలెనే మానక యెవ్వతెనైన మచ్చికం దగిలి నాతో ... నానిపట్టి సరివేసే వద్దిరా నీవూ చ. కడు(బాతకులు నిన్నుఁగదిసి కొలిచేరంటా నడరి పుణ్యులఁజేయునటువలెనే కడఁగి యెవ్వతెనైన గాజు మాణికము సేసి వడి నన్నుఁ గెరలించవద్దురా నీవూ చ. దిందుపడ మాయసేసి దేవుఁడ నేఁగానంటా. నందరి భ్రమలఁ బెట్టునటువలెనే అందమైనన తిరువేంకటాద్రీశ నీప్రేమ చెంది నన్నుఁ గూడి దాఁచజెల్లునా నీవూ రేకు:0237-01 ధన్నాసి సంపుటము: 03-210 పల్లవి: ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు పదిలానఁ గొలువఁగా ప్రత్యక్షమయ్యేవు చ. యెదలో నుండుదువని యిన్ని వేదాలు చెప్పగా వెదకి ధ్యానము సేతు వెస గనుఁగొంట లేదు చెదర కందే మరి జీవుఁడు నున్నాఁ డందురు పదిలముగాఁ జూత్రు భావించరాదు చ. అంతటా నుందువని ప్రపదుఁడు చెప్పెననఁగా చింతించి పట్టఁదలఁతు చేతికిఁ జిక్కుట లేదు సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు మంతనానఁ బిలు నొకమాట వినఁబడదు చ. రవిలో నుందువని సురలు నిన్నుఁ గొలువఁగా తవిలి పూజించేనంటే దగ్గరి వచ్చుట లేదు యివల శ్రీవేంకటాద్రి నిరవై నీవున్నాఁడవు తివిరి సేవించితిమి బ్రిష్టమాయ మాకు పె.అ.రేకు:0019–02 మంగళకౌశిక సంపుటము: 15-106 పల్లవి: ఇది గాదు తెరువు యీడేరేవారికి అదన విజ్ఞాని యైతే అతఁడే రక్షించును చ. తలఁపులు చక్కఁగాక దైవముఁ దలఁచఁబోతే వెలి దున్నని నేలను విత్తిన యట్లు పొలసి దాసుఁడుగాక పూజించఁ బోవు టెల్ల బలిమి దేవునిఁ బట్టి బంటకు నాఁగుటా చ. తనవైరాగ్యము లేక తత్త్యము వెదకేనంటే తనియ కిసుక పాఁతర దవ్వటా కొనభక్తిలేక హరిఁగోరి మొక్కు టెల్ల మొనసి దేవుని సొమ్ము ముచ్చిలించుకొనుటా చ. వెస గురుఁడు లేక శ్రీ వేంకటేశు సాధించితే అసదై (?) యందనిపంటి కఱు చాఁచుట