పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

237

తనకు శ్రీవేంకటేశుఁ దలపించేవా రెవ్వరు
కొనమొద లెఱిఁగిన గురుఁడే కాక

రేకు:0291-03 లలిత సంపుటము: 03-526
పల్లవి: ఇతరుల నడుగము యితఁడే మా దాత
యితని యీవి వొరు లియ్యఁగఁ గలరా

చ. దేవ దేవుఁ డాదిమపురుషుఁడు హరి
శ్రీవత్సాంకుఁడు చిన్మయుఁడు
యీవల నావల యిలువేలుపతఁడు
భావజగురుఁడు మూ పాలిటివాఁడు

చ. జగదేకగురుఁడు శాశ్వతుఁ డచ్యుతుఁ
డగజకు వరదుఁడు అనOతుఁడు
తగి మము నేలిన దైవము యేలిక
నిగమమూర్తి మా నిజబంధువుఁడు

చ. కలిదోషహరుఁడు కైవల్యవిభుఁడు
అలరిన శ్రీవేంకటాధిపుఁడు
చలిమి బలిమి మూ జననియు జనకుఁడు
అలమి యితఁడు మాయంతర్యామి

రేకు:0041-04 శ్రీరాగం సంపుటము: 01-252
 పల్లవి: ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులు
సంపూర్ణమోహవిరహితు లెఱుగుఁదురు నిను నిందిరారమణా

చ. నారీకటాక్షపటు నారాచభయరహిత
శూరులెఱుఁగుదురు నినుఁ చూచేటి చూపు
ఘోరసంసార సంకులపరిచ్ఛేదులగు
ధీరులెఱుఁగుదురు నీదివ్యవిగ్రహము

చ. రాగభోగవిదూర రంజితాత్ములు మహా
భాగు లెరుఁగుదురు నినుఁ బ్రణుతించువిధము
ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా
యోగులెఱుఁగుదురు నీవుండేటివునికి

చ. పరమభాగవత పదపద్మసేవానిజా
భరణులెఱుఁగుదురు నీ పలికేటిపలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస
స్థిరు లెఱుఁగుదురు నినుఁ దిరువేంకటేశ

రేకు:0335-02 గుజ్జరి సంపుటము:04-191
 పల్లవి: ఇతరోపాయములెల్ల యీ సందివే
అతిశయపదమైతే హరిదాస్యఫలమే

చ. కర్మము సేయ నేరరా కడఁగి సన్యాసులు
కర్మము విడిచి మోక్షముఁ బొందిరి
ధర్మమెరఁగనివారా తత్వపుయోగీంద్రులు సర్వ
ధర్మము విడిచి హరిఁ దమలోనే కనిరి

చ. దానాలు సేయనేరరా తగిలి యోగీంద్రులన్ని
మాని హరిజపమే నెమ్మడిఁ జేసిరి
నానావిధు లెరఁగరా నాఁడు విభషణాదులు
శ్రీనాథు శరణని చిరదేహులైరి

చ. సతతసంగములెల్ల జన్మబంధ హేతువని
మతిమంతులైనవారు మానిరిగాక